టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో సుమ కనకాల కూడా ఒకరు. ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా గుర్తింపు పొందిన సుమ బుల్లితెర మీద ప్రసారం అవుతున్న అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా స్టార్ హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తూ ఉంటుంది. స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమా కచ్చితంగా ఆ ఈవెంట్ లో హోస్ట్ చేయాలి.
ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే స్టార్ హీరోలు అందరూ మాత్రం సుమా డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో సుమకి అంత క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఇలా టీవీ షోలు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుమ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల రూపంలో యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇలా నిత్యం బిజీగా ఉండే సుమ ఇటీవల మరొక కొత్త షో స్టార్ట్ చేసింది. “సుమ అడ్డా” అనే కొత్త షో ఈటీవీలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ తో పాటు కమెడియన్ అలీ, పోసాని కృష్ణ మురళి గారు కూడా పాల్గొని సందడి చేశారు. సుమ షో అంటేనే పక్కా ఎంటర్టైన్మెంట్ అని అందరికీ తెలిసిందే. ఇక ఎప్పటిలాగే ఈ షోలో కూడా సుమ తన కామెడీ టైమింగ్ తో సెటైర్లతో చాలా సందడి చేసింది.
ఇక ఈ షోలో జానీ మాస్టర్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. జానీ మాస్టర్ కావాలనే అమ్మాయిలను గుద్దటానికి రోడ్డు మీదకి వెళ్తాడని పంచులు వేసింది. ఇక అలీ పోసాని కృష్ణమురళి హాజరైన ఎపిసోడ్ లో కూడా సుమా చాలా సందడి చేసింది. ఈ ఎపిసోడ్ లో సుమ అలీతో మాట్లాడుతూ.. చిరంజీవి గారిని కలిస్తే మీరు ఆయన మొహం ఎందుకు చూడరు అని అడగగా… తనని చూడగానే చిరంజీవి గారు ఏదో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారని అందువల్లే ఆయన నమ్మకం చూడలేక నవ్వుకుంటానని అలీ సమాధానం చెప్పాడు.