మాస్ సినిమాల్లో హీరోయిజాన్ని పండించడం అనేది రకరకాలుగా ఉంటుంది. హీరోయిన్ ఆపదలో ఉంటే హీరో కాపాడటం అనేది ఒకప్పుడు ఉండేది. హీరోయిన్ కోసం హీరో ఫైట్ చేసిన వెంటనే.. హీరోయిన్, హీరోతో ప్రేమలో పడిపోవడం.. ఆ తర్వాత వీళ్ళ జర్నీ పెళ్లి వరకు ఎలా వెళ్తుంది అన్నది మిగిలిన కథగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సీన్లు చేయడానికి ఫిలిం మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.నిస్సహాయ స్థితిలో ఉండే ప్రజలు, వాళ్ళని పీడిస్తున్న విలన్ గ్యాంగ్ ని పెడితే పండే హీరోయిజానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
Salaar, Pushpa 2:
దీనికి ఇంకొంచెం మాస్ డోస్ ను పెంచడానికి ఆడకూతుర్లని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అవును ఇప్పుడు ఇదే ట్రెండ్. గత ఏడాది వచ్చిన ప్రభాస్ (Prabhas) ‘సలార్’ (Salaar) (సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్) ని తీసుకుంటే, అందులో కాన్సార్ అనే ప్రదేశం. అక్కడి ప్రజలు మన్నార్ ఫ్యామిలీ వల్ల ఇబ్బందులకు గురవ్వడం. విలన్ గ్యాంగ్లో ఓ వ్యక్తి.. అతనికి నచ్చినప్పుడు ఓ ఏరియాకి వెళ్లి యుక్త వయసుకి వచ్చిన ఆడపిల్లలని తీసుకెళ్లి అనుభవించడం.. అక్కడ మిగిలిన అమ్మాయిలు బాధపడటం వంటివి జరుగుతుంది.
ఈ క్రమంలో వాళ్ళు కాటేరమ్మని ఆశ్రయించడం.. ఆ తర్వాత హీరో వచ్చి మరో ఆడకూతురుకి అన్యాయం జరుగుతుంటే విలన్ మనుషులని తెగ నరకడం వంటివి సినిమాకి మంచి హై ఇస్తుంది. ప్రభాస్ కటౌట్ కూడా ఆ ఫైట్లో చూడటానికి చాలా బాగుంటుంది. ‘సలార్’ సినిమా అప్పటివరకు ఫ్లాట్ గా వెళ్తుంది అని ఆడియన్స్ ఫీలైన టైంలో.. అందరిలో జోష్ నింపిన సీన్ ఇది. సినిమా సూపర్ హిట్ అనే ఫీల్ వచ్చింది ఈ ఫైట్ చూశాకే అని చెప్పాలి.
ఇక ఈ ఏడాది వచ్చిన ‘పుష్ప 2’ లో (Pushpa 2: The Rule) విలన్ గ్యాంగ్ కి చెందిన కొందరు హీరో అన్న కూతురిపై లైం*క దాడికి పాల్పడతారు.ఆ టైంలో హీరో గంగమ్మ తల్లి గెటప్లో ఎంట్రీ ఇచ్చి విలన్ గ్యాంగ్ ని చితక్కొడతాడు. క్లైమాక్స్ లో కూడా ఆ అమ్మాయిని కాపాడటం కోసం హీరో చేసే ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ‘పుష్ప 2’ కి కూడా ఇదే హైలెట్ అని చెప్పాలి. అందుకే 2023 ఎండింగ్లో కాటేరమ్మ కొడుకు, 2024 ఎండింగ్లో గంగమ్మ తల్లి కొడుకు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.