పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నగా చిరంజీవిని చెప్పుకునే రేంజ్ కి ఎదిగాడు. నటుడిగా చిరంజీవితో పవన్ కళ్యాణ్ ను పోల్చడం తప్పయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో చిరు కంటే పవన్ స్థాయి పెద్దది. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కేవలం సేఫ్ గేమ్ ఆడే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ అనుకోలేదు. హీరో అంటే ఇంట్రోలొ పెద్ద ఫైట్, సాంగ్ ఇంటర్వెల్ కి భారీ ఫైట్, క్లైమాక్స్ లో మరింత పెద్ద ఫైట్..
ఈ కాలిక్యులేషన్స్ తో సినిమా చేయాలని కూడా అతను అనుకోలేదు. హీరో అల్లరి చిల్లరగా తిరిగితే, తండ్రితో తిట్లు, దెబ్బలు తిని రియలైజ్ అవ్వడంతో కూడా హీరోయిజం ఉంది అని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశారు. ‘తొలిప్రేమ’ (Tholi Prema) ‘తమ్ముడు’ (Thammudu) వంటి సినిమాల్లో పవన్ నటన, మేనరిజమ్స్ ని అప్పటి యూత్ మాత్రమే కాదు ఇప్పటి యూత్ కూడా రిలేట్ చేసుకుంటారు. అందుకే పవన్ ఓన్ చేసుకుని.. అతనికి స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టారు. సరిగ్గా పవన్ లానే.. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇతను కూడా కొన్ని సినిమాల్లో తండ్రితో తిట్లు తినే పాత్రలు చేశాడు. ‘పెళ్ళి చూపులు’ (Pelli Choopulu) ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమాలతో విజయ్ (Vijay Devarakonda) రేంజ్ పెరగడంతో.. అతను ఇంకా నెక్స్ట్ లెవెల్..కి వెళ్తాడు అని అంతా భావించారు. కానీ ఆ తర్వాత విజయ్ ఎంపిక చేసుకున్న కథలు.. ఆ స్థాయిలో లేకపోవడం వల్ల.. కొంచెం రేసులో వెనుకబడ్డాడు విజయ్. ఇంకో రెండు సాలిడ్ హిట్లు పడితే విజయ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఇప్పటికీ లేకపోలేదు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డని (Siddu Jonnalagadda) కూడా పవన్ కళ్యాణ్ తో పోలుస్తున్నారు కొంతమంది.
ఈరోజు జరిగిన ‘జాక్’ (Jack) సాంగ్ లాంచ్ ఈవెంట్లో ‘ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాదిరి మీరు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు’ అంటూ కొందరు రిపోర్టర్లు సిద్ధు గురించి ప్రస్తావించడం జరిగింది. పవన్ రేంజ్లో అప్పుడే సిద్ధుని ఎలివేట్ చేయలేము కానీ… విజయ్ లానే ఇతను కూడా యూత్ కి దగ్గరయ్యే పాత్రలు చేశాడు. ‘తండ్రితో తిట్టించుకునే పక్కింటి అబ్బాయ్ టైపు రోల్స్ చేస్తున్నాడు. సరైన హిట్లు 2 పడితే.. ఇతను కూడా అతనిలా స్టార్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిద్ధులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే… ఇతనిలో మంచి రైటర్ కూడా ఉండటం. మరి వాటిని అతని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటాడో చూడాలి.
పవన్ కళ్యాణ్ తో పోల్చడం అనేది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్!#SiddhuJonnalagadda #PawanKalyan #JACK #VaishnaviChaitanya pic.twitter.com/8b30YDO9dW
— Filmy Focus (@FilmyFocus) March 20, 2025