Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Reviews » Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • January 8, 2026 / 08:00 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • వర్ష బొల్లమ్మ (Heroine)
  • మేఘలేఖ, రాజీవ్ కనకాల, రమణ భార్గవ్, సుచిత్ర ఆనందన్, జ్వాలా కోటి తదితరులు (Cast)
  • ప్రశాంత్ కుమార్ దిమ్మల (Director)
  • కోవెలమూడి సత్య సాయి బాబా - వేమూరి హేమంత్ కుమార్ (Producer)
  • సురేష్ బొబ్బిలి (Music)
  • శ్రీరామ్ ముక్కపాటి (Cinematography)
  • మాధవ్ కుమార్ గుళ్లపల్లి (Editor)
  • Release Date : జనవరి 08, 2026
  • మీటియర్ ఎంటర్టైన్మెంట్స్ (Banner)

సాధారణంగా ఈటీవీ విన్ నుండి ఒక కంటెంట్ వస్తుంది అంటే.. కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంది ఆ సంస్థ. అయితే.. మంచి హైప్ తో రిలీజ్ అయిన “కానిస్టేబుల్ కనకం” సీజన్ 1 మాత్రం పెద్దగా అలరించలేకపోయింది. ముఖ్యంగా 6 ఎపిసోడ్ల సీజన్ 1 ల్యాగ్ కారణంగా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయింది. ఆ తప్పులను సరిదిద్దుకొని సీజన్ 2తో ప్రేక్షకుల్ని మరోసారి పలకరించనున్నారు. మరి ఈ సీజన్ 2 ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? తెరలేపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలిగిందా? అనేది చూద్దాం..!!

Constable Kanakam Season 2 Review

కథ: కనిపించకుండాపోయిన చంద్రిక (మేఘలేఖ)ను వెతికి పట్టుకోవడమే ధ్యేయంగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి (వర్ష బొల్లమ్మ)కి చంద్రిక అదృశ్యం విషయంలో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ విషయాల ఆధారంగా చంద్రికను కనకం కనిపెట్టగలిగిందా? ఇంతకీ చంద్రిక అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు? వాళ్లని కనకం ఎలా ఎదుర్కొంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “కానిస్టేబుల్ కనకం: సీజన్ 2” కథాంశం.

Constable Kanakam Webseries Review and Rating

నటీనటుల పనితీరు: వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ ఆర్క్ లో మెచ్యురిటీని ఆమె తెరపై పండించిన తీరు ప్రశంసార్హం. నటిగా ఆమెకు ఈ సిరీస్ ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు.

సిరీస్ కి మరో ఇంపాక్ట్ ప్లేయర్ మేఘలేఖ. మొదటి సీజన్ లో చాలా లిమిటెడ్ సీన్స్ లో లుక్స్ తో మాత్రమే మెప్పించిన మేఘలేఖ, సెకండ్ సీజన్ లో మాత్రం కీలకపాత్రతో మెప్పించింది. ముఖ్యంగా ఆమె చుట్టూ అల్లుకున్న సందర్బాలు, సన్నివేశాలు అలరిస్తాయి.

సుచిత్ర ఆనందన్ క్యాస్టింగ్ & పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె గురించి ఎక్కువగా చెప్పలేం. సిరీస్ చూశాక సర్ప్రైజ్ అవ్వడమే కరెక్ట్.

రాజీవ్ కనకాల, రమణ భార్గవ్, జ్వాల కోటిల పాత్రలు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ.. ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

Constable Kanakam Webseries Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: సురేష్ బొబ్బిలి మరోసారి తన సత్తా చాటుకున్నాడు. నేపథ్య సంగీతంతో టెన్షన్ క్రియేట్ చేసిన విధానం ఎంత బాగుందో.. చివర్లో ఎమోషన్ ను ఎలివేట్ చేసిన తీరు కూడా అంతే బాగుంది.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉండగా.. ఎడిటింగ్ సెకండ్ సీజన్ కి మెయిన్ ఎసెట్ గా నిలిచింది. మొదటి సీజన్ కి వచ్చిన రివ్యూలు, ఫీడ్ బ్యాక్ ను కాస్త సీరియస్ గా తీసుకొని.. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు కానీ, రిపీటెడ్ షాట్స్ కానీ లేకుండా చాలా క్రిస్ప్ గా కట్ చేసారు. అందువల్ల.. 4 ఎపిసోడ్స్ సిరీస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అస్సలు బోర్ కొట్టదు.

దర్శకుడు ప్రశాంత్ ను సీజన్ 1 విషయంలో అనవసరంగా తిట్టుకున్నానే అని భావన కలిగింది సెకండ్ సీజన్ చూసాక. ఇంచుమించుగా 20 పాత్రలు కనిపించే సిరీస్ లో ప్రతి పాత్రకి ఒక క్లోజర్ ఇవ్వడం, అది కూడా కథనానికి తగ్గట్లుగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఒక రచయితగా సెకండ్ సీజన్ లోని ప్రతి ఎపిసోడ్ తో తన సత్తా చాటుకున్నాడు ప్రశాంత్. ముఖ్యంగా.. సిరీస్ కోర్ థీమ్ ను అతను అంతర్లీనంగా డిజైన్ చేసిన విధానం, దాన్ని చివర్లో ఎలివేట్ చేసిన తీరు అతడి అభిరుచికి అద్దం పట్టింది. అలాగే.. దర్శకుడిగా షాట్ మేకింగ్ & ఆర్టిస్టుల నుండి మంచి నటన రాబట్టుకొనే విషయాల్లో అతడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.

Constable Kanakam Webseries Review and Rating

విశ్లేషణ: కంటెంట్ ఎవైలబిలిటీకి లిమిట్ లేకుండాపోయిన ఈ కాలంలో.. ఒక సినిమా లేదా సిరీస్ తో ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం అనేది కత్తి మీద సాములా తయారయ్యింది. అందుకే మొదటి సీజన్ లో తడబడిన కనకం & టీమ్ సెకండ్ సీజన్ తో మాత్రం ఒక మంచి థ్రిల్లర్ చూశామనే సంతృప్తిని కలిగించగలిగారు. అలాగే.. సీజన్ 3 కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. కాస్త లేటైనా.. ఇంతే గ్రిప్పింగ్ గా సీజన్ 3 కూడా దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కించగలిగితే.. తెలుగు ఓటీటీ ప్రపంచంలో కానిస్టేబుల్ కనకం బెస్ట్ థ్రిల్లర్ గా నిలవడం ఖాయం.

ఫోకస్ పాయింట్: ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసిన కనకం!

రేటింగ్: 3/5

Click Here For Season 1 Review

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Constable Kanakam
  • #Megha Lekha
  • #Rajeev Kanakala
  • #Srinivas Avasarala
  • #varsha bollamma

Reviews

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

8 hours ago
Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

12 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

14 hours ago
Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

16 hours ago

latest news

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

16 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

18 hours ago
Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

20 hours ago
Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

20 hours ago
Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version