సూపర్ స్టార్ రజినీకాంత్ తో (Rajinikanth) జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పోటీ ఏంటి..అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie) అనే పాన్ ఇండియా సినిమా రూపొందుతుంది. కోలీవుడ్లో ‘విక్రమ్’ తో (Vikram) ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్, ‘జైలర్’ తో (Jailer) ఇండస్ట్రీ హిట్ కొట్టిన రజినీకాంత్.. కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కాబట్టి.. మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే టాలీవుడ్లో కూడా మంచి హైప్ ఏర్పడుతుంది.
‘లియో’ (LEO) వంటి ప్లాప్ కంటెంట్ మూవీ కూడా ఇక్కడ భారీ వసూళ్లు సాధించింది. పైగా ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో.. ‘కూలీ’ కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరే మొదటి తమిళ సినిమా అవుతుంది అని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను మే 1 న విడుదల చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ‘కూలీ’ ఆగస్టు 11,12 డేట్లకి మారుతున్నట్టు తెలుస్తుంది.
అయితే ఆగస్టు 14 కి ‘వార్ 2’ రిలీజ్ అవుతుంది అనే టాక్ కూడా నడుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయాన్ ముఖర్జీ భారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్నాడు కాబట్టి.. తెలుగులో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
అయితే ‘కూలీ’ కూడా అదే టైంలో రిలీజ్ అయితే ‘వార్ 2’ ఓపెనింగ్స్ పై దెబ్బ పడే అవకాశాలు ఎక్కువే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘వార్ 2’ ని పోస్ట్ పోన్ చేస్తేనే బెటర్ అనేది చాలా మంది అభిప్రాయం. మరి మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
BUZZ : #Rajinikanth‘s #Coolie is moving from a summer release to the Independence Day weekend. During the same period, #NTR‘s #War2 has already been announced.