బిగ్ బాస్ కార్యక్రమం ప్రతిభాషలోనూ కొన్ని సీజన్లను పూర్తి చేసుకొని ఎంతో విజయవంతంగా ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తెలుగులో ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ఇప్పటికే 11 వారాలను పూర్తి చేసుకుంది. ఇకపోతే తెలుగులో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మొదటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం పై ఎంతోమంది నేటిజెన్లు, రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తూ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ కార్యక్రమం పట్ల సిపీఐ నేత నారాయణ మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అశ్లీలత కంటెంట్ బయటకు వస్తోందని ఈయన మండిపడ్డారు.ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలంటూ ఈయన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.
ఇక బిగ్ బాస్ కార్యక్రమాన్ని బ్రోతల్ హౌస్ అంటూ పోల్చడమే కాకుండా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జునపై కూడా ఈయన మండిపడ్డారు.ఇకపోతే ఈ కార్యక్రమం గురించి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఏపీ హైకోర్టు స్పందించి బిగ్ బాస్ నిర్వాహకులకు అలాగే నాగార్జునకు నోటీసులు జారీ చేయడంతో నారాయణ ఈ విషయంపై స్పందించి ఏపీ హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమం విషయంలో ఏపీ హైకోర్టు చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని ఇలాంటి షోలను బ్యాన్ చేయడం వల్ల సమాజానికి ఎంతో మంచి చేసిన వాళ్ళవుతామంటూ ఈయన మరోసారి బిగ్ బాస్ కార్యక్రమం పై మండిపడ్డారు.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!