Cpi Narayana, Nagarjuna: పెళ్లైన వారికే శోభనానికి లైసెన్సా.. నారాయణ ఘాటు వ్యాఖ్యలు!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ విషయంలో బిగ్ బాస్ షోను సపోర్ట్ చేస్తే మరి కొందరు బిగ్ బాస్ షోను విమర్శిస్తారనే సంగతి తెలిసిందే. అయితే సీపీఐ నారాయణ గత కొంతకాలంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో బిగ్ బాస్ షోపై విమర్శలు చేస్తూ ఆ విమర్శల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. నాగార్జునపై నారాయణ చేసిన కామెంట్లు నాగ్ ఫ్యాన్స్ కు కూడా ఆగ్రహం కలిగించాయి.

మొదట నారాయణ విమర్శలను పెద్దగా పట్టించుకోని నాగార్జున శనివారం ఎపిసోడ్ లో మాత్రం నారాయణకు చురకలంటించారు. నాగార్జున రోహిత్ మెరీనా జంటకు అందరూ ఉన్నారని ఇబ్బంది పడవద్దని మీకు లైసెన్స్ ఉందని సూచనలు చేశారు. ఇద్దరూ టైట్ హగ్ ఇచ్చుకోవాలని నాగ్ సూచించగా రోహిత్ మెరీనా నాగ్ చెప్పిన విధంగా చేశారు. ఆ తర్వాత నాగ్ ఈ జంటను చూపిస్తూ “నారాయణ నారాయణ వాళ్లిద్దరూ మ్యారీడ్” అని కామెంట్ చేశారు.

అయితే నాగార్జున కౌంటర్ తన దృష్టికి రావడంతో నారాయణ సైతం వెంటనే రియాక్ట్ అయ్యారు. “నాగన్నా.. నాగన్నా మీ బిగ్ బాస్ షోలో మీరు పెళ్లైన వారికే లైసెన్స్ ఇచ్చారు.. వారికే శోభనం గది ఏర్పాటు చేశారు.. మరి మిగతా వాళ్లు అంతా ఏమయ్యారన్నా?.. వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు కదా?.. వాళ్లు బంధువులు కాదు కదా? నూరు రోజుల పాటు వాళ్లు కూడా ఏం చేస్తారో అది కూడా చెప్పన్నా” అని అన్నారు.

నాగార్జున ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నాగ్ శ్రేయోభిలాషులు మాత్రం నారాయణ నోరు మంచిది కాదని నాగార్జున అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. నాగార్జున సైలెంట్ గా ఉంటే నారాయణ మాటలకు విలువ లేకుండా పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ వ్యతిరేకులకు ఛాన్స్ ఇచ్చేలా నాగ్ వ్యవహరించకూడదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus