టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న టాలీవుడ్ హీరోల సినిమాలన్నీ 200 కోట్ల రూపాయల కంటే ఎక్క్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. భవిష్యత్తు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటామని బాక్సాఫీస్ ను షేక్ చేస్తామని స్టార్ హీరోలు నమ్మకంతో ఉన్నారు. టాలీవుడ్ స్టార్స్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.
అయితే సాధారణ అభిమానులతో పాటు సెలబ్రిటీలలో సైతం టాలీవుడ్ స్టార్స్ ను అభిమానించే వాళ్లు ఉన్నారు. ప్రముఖ క్రికెటర్ షమి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ నా ఫేవరెట్ టాలీవుడ్ స్టార్ హీరోలు అని చెప్పుకొచ్చారు. సౌత్ సినిమాలు చూడటం అంటే నాకు ఎంతో ఇష్టమని ప్రభాస్, ఎన్టీఆర్ లను ఎంతో అభిమానిస్తానని షమి (Shami) కామెంట్లు చేశారు. భారత క్రికెటర్లు కూడా తెలుగు హీరోల సినిమాలు చూస్తారని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సౌత్ సినిమాలను చూస్తానని క్రికెటర్ షమి తెలిపారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేతిలో ఏకంగా 5 నుంచి 6 ప్రాజెక్ట్ లు ఉండగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో 3 నుంచి 4 ప్రాజెక్ట్ లు ఉన్నాయి. జక్కన్న సినిమాల ద్వారా ఈ ఇద్దరు హీరోల మార్కెట్ మరింత పెరిగింది. ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ కల్కి 2898 ఏడీ, కన్నప్ప సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుండగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఇద్దరు హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.