‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నుండి వచ్చిన సినిమా ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రెండు రోజులు సూపర్ గా కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వచ్చాక ఈ సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి.
ఆ తర్వాత పికప్ అయ్యింది ఎక్కువగా లేదు. దీంతో బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఒకసారి (Daaku Maharaaj) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 14.55 cr |
సీడెడ్ | 12.31 cr |
ఉత్తరాంధ్ర | 11.01 cr |
ఈస్ట్ | 7.11 cr |
వెస్ట్ | 5.19 cr |
గుంటూరు | 7.73 cr |
కృష్ణా | 5.43 cr |
నెల్లూరు | 3.27 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 66.60 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.07 cr |
ఓవర్సీస్ | 8.13 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 78.80 cr (షేర్) |
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.78.8 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.7 కోట్ల(షేర్) దూరంలో ఆగిపోయింది. మొత్తంగా ఈ సినిమా అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.