నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు.
మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.దీంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండో వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది.3 వ వారంలో కూడా ఈ మూవీ థియేటర్స్ బాగానే హోల్డ్ చేసింది. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
25.04 cr
సీడెడ్
5.20 cr
ఉత్తరాంధ్ర
4.34 cr
ఈస్ట్
2.20 cr
వెస్ట్
1.23 cr
గుంటూరు
2.42 cr
కృష్ణా
2.06 cr
నెల్లూరు
0.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
43.40 cr
కర్ణాటక
4.58 cr
తమిళనాడు
0.93 cr
కేరళ
0.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.94 cr
ఓవర్సీస్
10.44 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
61.74 cr (షేర్ )
‘దసరా’ (Dasara) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.15 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.61.74 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కి ఆల్రెడీ రూ.14.24 కోట్ల లాభాలను అందించింది.
ఈ మూవీ సూపర్ హిట్ గా అయితే నిలిచింది కానీ మిగిలిన భాషల్లో ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. అయితే నైజాంలో రూ.25 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.