విశాల్ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “తుప్పరివాలన్”. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్ అయ్యింది. అను ఎమ్మాన్యూల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆండ్రియా నెగిటివ్ రోల్ లో నటించింది. మరి తమిళనాట ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం “డిటెక్టివ్” పేరుతో తెలుగులో నేడు విడుదలైంది.
కథ : అద్వైత భూషణ్ (విశాల్) వైజాగ్ లోని ప్రైవేట్ డిటెక్టివ్, పోలీసులు కూడా సాల్వ్ చేయలేని ఎన్నో సమస్యలను అద్వైత భూషణ్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తుంటాడు. ఒకానొకరోజు నవీన్ అనే చిన్న పిల్లాడు తన కుక్క బుల్లెట్ కారణంగా చనిపోయింది.. ఎవరు చంపారో కనుక్కోండి అంటూ అద్వైత భూషణ్ ను సంప్రదిస్తాడు.
ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన అద్వైత భూషణ్ కు కుక్క హత్య వెనుక మరిన్ని హత్యలున్నాయని తెలుసుకొంటాడు. ఈ హత్యలు చేస్తున్నది డెవిల్ గ్యాంగ్ అని సంప్రదిస్తాడు. ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన అద్వైత భూషణ్ కు కుక్క హత్య వెనుక మరిన్ని హత్యలున్నాయని తెలుసుకొంటాడు. ఈ హత్యలు చేస్తున్నది డెవిల్ గ్యాంగ్ అని తెలుసుకొంటాడు. ఈలోపు తమ డీటెయిల్స్ ను కలెక్ట్ చేస్తున్న అద్వైత భూషణ్ ను చంపడానికి డెవిల్ గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. ఇంతకీ చివరికి అద్వైత భూషణ్ ఆ డెవిల్ గ్యాంగ్ ను పట్టుకోగలిగాడా? అందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది “డిటెక్టివ్” కథాంశం.
నటీనటుల పనితీరు : ఎప్పుడూ మాస్ రోల్స్ లో కనిపించి కనిపించీ బోర్ కొట్టించిన విశాల్ “షెరలాక్ హోమ్స్” సినిమాలో హీరోలా స్టైలిష్ అండ్ సెటిల్డ్ గా కనిపించాడు. ఒక డిటెక్టివ్ ఎలా బిహేవ్ చేస్తాడు, అతడి బాడీ లాంగ్వేజ్ ను బాగా స్టడీ చేయడం వల్ల తెరమీద విశాల్ ను చూస్తున్నంతసేపూ ఒక నిజమైన డిటెక్టివ్ ను చూస్తున్నట్లే ఉంటుంది. అలాగే ఎమోషన్ సీన్స్ లోనూ ప్రశంసార్హమైన నటన ప్రదర్శించాడు. విశాల్ కు వెన్నంటి ఉండే స్నేహితుడు మనోహర్ పాత్రలో ప్రసన్న బాగా సపోర్ట్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు కూడా.
“వాన” ఫేమ్ వినయ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ “డిటెక్టివ్” ద్వారా తెలుగు ప్రేక్షకులను నెగిటివ్ రోల్ లో పలకరించడం విశేషం. ఈ చిత్రంలో డెవిల్ పాత్రలో విపరీతమైన క్రూరత్వం ప్రదర్శించకుండానే టిపికల్ విలన్ గా మెప్పించాడు. విపరీతమైన కోపంతో వంట చేసే స్పిన్నింగ్ షాట్ లో పలికించిన భావం అభినందనీయం. అను ఎమ్మాన్యూల్ పాత్ర కొత్తగా ఉంది కానీ.. ఇంకాస్త ఎమోషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిడివి కూడా తక్కువ కావడం వల్ల ఆమె క్యారెక్టర్ వల్ల సినిమాలో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఇక ఆండ్రియా నెగిటివ్ రోల్ లో రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి చాలా దూరంగా ఇంటెన్స్ రోల్ లో పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా.. టైట్ క్లోజ్ షాట్స్ లో ఎక్స్ ప్రెషన్ లేకుండా కేవలం లుక్స్ తో ఆండ్రియా ఇరగదీసింది.
సాంకేతికవర్గం పనితీరు : అర్రోల్ కొర్రీల్ నేపధ్య సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు కావాల్సిన ఇంటెన్సిటీని సన్నివేశానికి తగ్గట్లుగా సమకూర్చాడు. అలాగే కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతంతో కాక సింక్ సౌండ్ తో డోర్ లాక్-ఓపెనింగ్ లాంటి సౌండ్స్ ను క్యాప్చూర్ చేసి సినిమాలో వాడిన విధానం బాగుంది. కార్తీక్ వెంకట్రామన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. గ్రే టింట్ లో సినిమా తీయడం వల్ల జోనర్ ఏంటీ అనేది ప్రతి ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. గోప్రో కెమెరాలతో షూట్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లు చాలా నేచురల్ గా ఉన్నాయి.
ఎడిటింగ్, డి.ఐ, కలరింగ్, వి.ఎఫ్.ఎక్స్ వంటి సాంకేతికపరమైన అంశాలన్నీ సినిమాకి యాడ్ ఆన్ ప్యాకేజస్ వలె యూజ్ అయ్యాయి. దర్శకుడు మిస్కిన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.. ఆయన మునుపటి చిత్రాలు “మాస్క్, పిశాచి”లను చూస్తే చాలు ఆయన టేకింగ్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అనే విషయం అర్ధమవ్వడానికి. “డిటెక్టివ్” కూడా అదే తరహాలో ఉంటుంది. మిస్కిన్ మార్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. హీరోహీరోయిన్లు ఒకరిపైఒకరు ప్రేమను వ్యక్తపరుచుకొనే సన్నివేశం మొదలుకొని.. కేస్ సాల్వ్ చేస్తూ తీగ లాగితే డొంకంతా కదలడం అనే కాన్సెప్ట్ తో స్క్రీన్ ప్లే రాసుకొన్న తీరు ప్రేక్షకుల్ని బాగా ఎగ్జయిట్ చేస్తుంది. ముఖ్యంగా.. సిమ్రాన్ చేత ఎమోషనల్ గా నిజం చెప్పించే సన్నివేశం ప్రశంసనీయం. ఏ ఒక్క సన్నివేశంలోనూ “ఇది ఇలా ఎందుకు అయ్యింది?” అని ప్రేక్షకుడు ఆలోచించేలోపు అందుకు సరైన సమాధానం చెప్పి వారి ఈగో సాటిస్ఫై చేసేవాడు మిస్కిన్.
విశ్లేషణ : మూడు పాటలు, నాలుగు ఫైట్లు, హీరోయిన్ అందాల ప్రదర్శన ఆశించి సినిమాలకి వెళ్ళేవారికి ఏమాత్రం అర్ధాంకాని అర్ధవంతమైన సినిమా “డిటెక్టివ్”. ఒక మంచి డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం, మంచి సస్పెన్స్ చూశామన్న అనుభూతిని కలిగించే చిత్రమిది. సో, డిఫరెంట్ మూవీస్ చూడాలని ఆశపడే ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా “డిటెక్టివ్”. అక్కడక్కడా కాస్త బోర్ కొట్టొచ్చు కానీ.. వేసిన చిక్కుముడులను విప్పడానికి ఆమాత్రం ల్యాగ్ అవసరమే అని క్లైమాక్స్ లో ఆడియన్స్ రియలైజ్ అవుతారు.