Dethadi Harika: సొంత ఇంటి కలలు నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ హారిక!

యూట్యూబ్ ద్వారా దేత్తడి పిల్లగా ఎంతో ఫేమస్ అయినటువంటి హారిక తెలంగాణ యాసలో అద్భుతమైనటువంటి వీడియోలు చేస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి హారిక సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండేవారు.

ఇలా తిరిగి తన యూట్యూబ్ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమెకు బేబీ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్గా అవకాశం కల్పించారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ పనులని జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇలా యూట్యూబర్ గా హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె తాజాగా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎంతో కష్టపడుతూ భారీగా సంపాదించినటువంటి హారిక తాజాగా తన సొంత ఇంటికలను నెరవేర్చుకొని గృహప్రవేశం చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను హారిక సోషల్ మీడియాలో షేర్ చేయకపోయినా గృహప్రవేశానికి వెళ్లినటువంటి ఇతర సెలబ్రిటీలు ఆమెతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ గృహప్రవేశానికి శివజ్యోతి దీప్తి సునయన కాజల్ వంటి తదితరులు హాజరయ్యారని తెలుస్తోంది. ఇలా ఈమె తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు (Dethadi Harika) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus