Matka , Lucky Baskhar: ‘మట్కా’ ‘లక్కీ భాస్కర్’..లలో కామన్ ఎమోషన్ ని గమనించారా?

‘మనీ’ ట్రెండ్ అనగానే రాంగోపాల్ వర్మ, శివ నాగేశ్వరరావు కాంబినేషన్లో రూపొందిన ‘మనీ’ సినిమా జోనర్ అనుకోకండి. అదొక కామెడీ థ్రిల్లర్. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది.. డబ్బు చుట్టూ అల్లుకున్న కథలతో రూపొందిన సినిమాల గురించి. వాస్తవానికి ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. అందరికీ ఉన్న కామన్ ఎమోషన్ అని కూడా చెప్పొచ్చు. ‘ఇంత లేకపోతే అంత’.. డబ్బు ఉంటే మన కష్టాలు అన్నీ తీరిపోతాయి అని అనుకోని మనిషంటూ ఉండడు అంటే అతిశయోక్తి కాదు.

Matka , Lucky Baskhar :

రాత్రికి రాత్రి కోటీశ్వరులం అయిపోయేంత సౌలభ్యం మనకు ఉండదు. అది సినిమా అనే ఊహా ప్రపంచంలోనే ఉంటుంది. అందుకే ఇలాంటి కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా డబ్బు థీమ్ తో రూపొందిన 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  ‘మట్కా’ (Matka) సినిమాలు. ముందుగా అక్టోబర్ 31 న ‘లక్కీ భాస్కర్’ సినిమా వస్తుంది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా రూపొందిన మూవీ ఇది. సితార సంస్థ నిర్మించగా వెంకీ అట్లూరి (Venky Atluri)  డైరెక్ట్ చేశాడు.

ఈ సినిమాలో హీరో ఓ బ్యాంకు ఉద్యోగి. కానీ జీతం సరిపోక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి టైంలో అతనికి భారీగా డబ్బు వచ్చి పడుతుంది. అది ఎలా సాధ్యమైంది? డబ్బు వచ్చాక.. ఆ హీరో ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అలాగే ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది మిగిలిన కథ. ‘లక్కీ భాస్కర్’ మాదిరే ‘మట్కా’ (Matka) కూడా అంతే. ఓ మార్కెట్లో కూలీగా పనిచేసే హీరో. అతను ఓ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లడం.

తిరిగొచ్చాక.. టైం కలిసొచ్చి పెద్ద రేంజ్..కి వెళ్లి భారీగా డబ్బు సంపాదించడం. అయితే డబ్బు సంపాదించాక.. అతనికి ఎలా శత్రువులు పెరిగారు? ఆ యుద్ధంలో అతను ఎలా గెలిచాడు? అనేది మిగిలిన కథ. మరి ఈ రెండు సినిమాలు సక్సెస్ అందుకుంటాయో లేదో తెలియాల్సి ఉంది. ‘లక్కీ భాస్కర్’ అక్టోబర్ 31 న, ‘మట్కా’ నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

సీనియర్ హీరోయిన్ సంపద 4600 కోట్లా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus