ఇప్పుడు ఓ దర్శకుడు వంద కోట్ల కలెక్షన్స్ సినిమా నిర్మాతకి ఇస్తే.. అతని నెక్స్ట్ సినిమాకి అతను రూ.25 కోట్లు, రూ.30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. దర్శకుడిని గుడ్డిగా నమ్మి నిర్మాతలు కూడా వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తున్నారు. ఒక పెద్ద సినిమా బడ్జెట్లో దర్శకుడు, హీరో పారితోషికాలే 50 శాతం ఉంటుంది. అయితే ‘లూసిఫర్’ రీమేక్ అయిన ‘ఎంపురాన్’ (L2: Empuraan) కి దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కానీ, హీరో మోహన్ లాల్ (Mohanlal) కానీ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఆ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.
ఇలాంటి ఫిలిం మేకర్స్ మన టాలీవుడ్లో లేరా అంటే దానికి దిల్ రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ ఈవెంట్లో ఓ రిపోర్టర్… ‘టాలీవుడ్లో వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ఫిలిం ‘గేమ్ ఛేంజర్'(Game Changer) చేశారు. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) వంటి పెద్ద పెద్ద దర్శకులతో పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మీకు సినిమా డైనమిక్స్ అన్నీ తెలుసు ఇక్కడ. మీ పక్కన కూర్చున్న మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ..
కేరళలో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా తీసి… ఇప్పటికీ పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సో వాళ్ళని చూసి మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటారా?’ అంటూ దిల్ రాజుని (Dil Raju) ప్రశ్నించాడు. అందుకు దిల్ రాజు.. “మీకు తెలుసో తెలియదో.. రాజమౌళి గారి స్కూల్ అదే.
రాజమౌళి (S. S. Rajamouli) గారు తీసే సినిమాలకి ఆయన పారితోషికం తీసుకోడు. లాభాల్లో వాటా తీసుకుంటారు. ప్రశాంత్ నీల్ కూడా అంతే. ఇలా ఒక్కొక్కరూ మొదలుపెడితే.. భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు సేమ్ స్కూల్ కి వస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఫిలిం మేకర్ ఇది పాటించడానికి ముందుకొస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.
రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఎప్పుడూ రెమ్యునరేషన్ తీసుకోరు.. లాభాల్లో వాటాలు మాత్రమే తీసుకుంటారు#L2Empuraan #Mohanlal #PrithvirajSukumaran pic.twitter.com/dZaom7qqNK
— Filmy Focus (@FilmyFocus) March 22, 2025