సంక్రాంతి పండుగకు ఎన్ని పెద్ద సినిమాలు విడుదలవుతున్నా ప్రధానంగా పోటీ మాత్రం వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాల మధ్య ఉండనుంది. అయితే వారసుడు సినిమాను చిరంజీవి, బాలయ్య సినిమాలకు పోటీగా దిల్ రాజు రిలీజ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి కెరీర్ లో హిట్లు ఉన్నా ఆ సినిమాలు మరీ రికార్డులు క్రియేట్ చేసే స్థాయి హిట్లు అయితే కాదు.
సంక్రాంతి సినిమాల డైరెక్టర్లకు దర్శకులుగా మంచి గుర్తింపే ఉన్నా మరీ ఊహించని స్థాయి క్రేజ్ ఉన్న దర్శకులు అయితే కాదనే సంగతి తెలిసిందే. సంక్రాంతి మూడు సినిమాల బడ్జెట్లు 500 కోట్ల రూపాయలు కాగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కావడం లేదు.విజయ్ వారసుడు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాలు సక్సెస్ సాధించి 2023 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి శుభారంభం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సంక్రాంతి సినిమాలు కనీసం 600 కోట్ల రూపాయల నుంచి 700 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమాలు హిట్ అనిపించుకుంటున్నాయి. సంక్రాంతి సినిమాలపై బయ్యర్లు సైతం భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూడు సినిమాలకు దాదాపుగా సమాన స్థాయిలో థియేటర్లను కేటాయించనున్నారని సమాచారం అందుతోంది. జనవరి ఫస్ట్ వీక్ నుంచి సంక్రాంతి సినిమాల హవా మొదలుకానుంది.
5 సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కాయో అతి త్వరలో స్పష్టత రానుంది. చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ తమ ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటామనే కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు.