ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల విడుదలకు అనుకూల పరిస్థితులు లేవు. అఖండ, పుష్ప సినిమాలు పోటీ లేకుండా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజవుతున్నా పెట్టుబడి రికవరీ కావడానికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది. ఒకేరోజు , ఒకే వారం రెండు పెద్ద సినిమాలు విడుదలైతే మాత్రం ఒక పెద్ద సినిమా నష్టపోక తప్పదు. అయితే సంక్రాంతికి ఏకంగా మూడు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కు ఐదు రోజుల పాటు థియేటర్ల విషయంలో ఇబ్బంది లేదు.
అయితే భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు మాత్రం పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కేటాయించిన థియేటర్లలో కొన్ని థియేటర్ల ఓనర్లతో డిస్ట్రిబ్యూటర్లు అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ కనీసం రెండు వారాలు ప్రదర్శించేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు భీమ్లా నాయక్ ను వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీలోపు భీమ్లా నాయక్ వాయిదా పడుతుందో లేదో క్లారిటీ రానుంది.
భీమ్లా నాయక్ తప్పుకుంటే థియేటర్లలో బంగార్రాజును రిలీజ్ చేయాలని నాగ్ భావిస్తున్నారు. అయితే దిల్ రాజు బంగార్రాజును కూడా వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నారని బోగట్టా. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మినహా సంక్రాంతికి మరే సినిమా రిలీజ్ కాకుండా దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయో లేదో చూడాల్సి ఉంది. భీమ్లా నాయక్ వాయిదా నిర్ణయం పవన్ పై ఆధారపడగా పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ లో చరణ్ నటించడంతో పవన్ భీమ్లా నాయక్ ను వాయిదా వేసే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లలో ఏ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది పాన్ ఇండియా సినిమాల రిలీజ్ లతో థియేటర్లు కళకళలాడనున్నాయి. రాజమౌళి ఖాతాలో ఆర్ఆర్ఆర్ తో బాహుబలి2 సినిమాను మించిన సక్సెస్ చేరుతుందేమో చూడాలి.