మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘విశ్వంభర’ (Vishwambhara) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్..లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం సినిమాని వాయిదా వేస్తున్నట్లు టీం చెప్పింది. ఇక తర్వాత సమ్మర్ కి రిలీజ్ అన్నారు. ఇప్పుడు అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు అని తెలుస్తుంది.
మరోపక్క ‘విశ్వంభర’ నుండి విడుదలైన టీజర్ కి మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘విశ్వంభర’ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కథనాలను గమనిస్తే.. ‘ఒక రాక్షసుడు ఉంటాడట. అతను కొంతమంది చిన్న పిల్లలను, దేవకన్యలు ఎత్తుకుపోతూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక దేవ కన్య భూమి మీదకు వస్తుంది.
ఆమె అనుకోకుండా హీరోని ప్రేమించడం, పెళ్లి చేసుకునే వరకు వెళ్లడం జరుగుతుంది. మరోపక్క ఆమె భూమిపై ఉందని తెలుసుకున్న రాక్షసుడు.. ఆమెను అలాగే ఒక ఫ్యామిలీకి చెందిన పాపని తీసుకుపోయి పాపని బలివ్వాలని అలాగే దేవకన్యని తన వశం చేసుకుని శక్తివంతుడు అయిపోయి..
ఆమె తండ్రిని, స్వర్గలోకాన్ని తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడట. అతని ప్లాన్ కి హీరో ఎలా ఎదురెళ్ళాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ అని అంటున్నారు. ఈ కథలో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. చాలా వరకు ఇది ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ కి దగ్గరగా ఉందని అనిపిస్తుంది.