ఈ సంక్రాంతికి దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రిలీజ్ కి ముందు భారీ అంచనాలు నెలకొల్పిన ‘గేమ్ ఛేంజర్’ ఆయన్ని నష్టాలపాలు చేసింది. అయితే ఆ వెంటనే వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ తిరిగి ఆయన్ని గట్టెక్కించింది. ఇది రీజనల్ మూవీ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రిలీజ్ అయ్యి 5 వారాలు దాటినా ఇప్పటికీ ఈ సినిమా డీసెంట్ షేర్స్ రాబడుతుంది.
ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి ఫన్ కంటెంట్ హిందీలో వచ్చి చాలా కాలం అయ్యింది. కాబట్టి.. కచ్చితంగా అక్కడ కూడా ఈ సినిమా బాగా ఆడుతుంది అనేది దిల్ రాజు నమ్మకం. కానీ దీన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే అతను చిరంజీవితో సినిమా ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం తన టీంతో ఆ సినిమా కథపై వర్క్ చేస్తున్నాడు.
దాని టార్గెట్ 2026 సంక్రాంతి అని కూడా రివీల్ చేశారు. సో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్ అనిల్ రావిపూడి చేయడం అనేది అసాధ్యం. దీంతో దిల్ రాజు వేరే ఆప్షన్స్ చూస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలాకాలం క్రితమే అతనికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు దిల్ రాజు. ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయడానికి ఇద్దరు, ముగ్గురు దర్శకులను కూడా అనుకున్నారు.
మరి వాళ్లలో ఎవరు ఫిక్స్ అవుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది గొప్ప కంటెంట్ ఉన్న సినిమా ఏమీ కాదు. అదంతా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్క్రీన్ ప్లే మ్యాజిక్. మరి అతనిలా ఆ మ్యాజిక్ ను రీ క్రియేట్ చేసే దర్శకుడు ఎవరో..? ఇది హిందీలో హిట్ అయ్యి దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెడుతుందో లేదో? చూడాలి.