టాలీవుడ్ సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఇప్పుడు తన మైండ్ సెటప్ ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ (Game changer) మూవీ ఫలితం, ఆయనకు ఊహించని ఆలోచనలను కలిగించిందని టాక్. శంకర్ (Shankar) లాంటి లెజెండరీ దర్శకుడితో సినిమా చేయడం అతనికి ఓ కల. కానీ ఆ కలను నిజం చేయడం కోసం భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అయితే, సినిమా ఫలితం ఆశించిన రేంజ్ లో రాకపోవడంతో, ఈ ప్రయోగాలు చేయడంపై ఇక నుండి మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడట.
ఇటీవలే సంక్రాంతికి తన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీతో హిట్ కొట్టి లాస్ ను కొంతవరకు బ్యాలెన్స్ చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు తన మార్క్ లోనే మళ్లీ సినిమాలను ప్లాన్ చేయాలని ఫిక్స్ అయిపోయాడట. గతంలో తన బ్యానర్ లో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా ఎంత సేఫ్ గేమ్ ఆడాయో చూసిన రాజు, మళ్లీ అదే రూట్ లో వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తన బేనర్ లో ఎప్పుడు లాభం ఇచ్చే సినిమాలు తీసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ కొత్త ప్లాన్ కోసం అనీల్ రావిపూడి (Anil Ravipudi) స్ట్రాటజీనే ఫాలో అవ్వాలని భావిస్తున్నాడు. అనీల్ రావిపూడి, దిల్ రాజు కాంపౌండ్ లో చేసిన ఆరు సినిమాలూ క్లీన్ హిట్స్ గా నిలిచాయి. ఒక్కటి కూడా బడ్జెట్ దాటకుండా, కంఫర్ట్ జోన్ లో ఉండేలా తెరకెక్కించటం అనీల్ స్పెషాలిటీ. దీంతో అనీల్ తన రైటింగ్ టీమ్ ను కూడా మరింత స్ట్రాంగ్ గా తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, దిల్ రాజు (Dil Raju) తన బ్యానర్ లో ఉన్న రచయితల టీమ్ ను మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు.
అనీల్ రావిపూడి స్క్రిప్ట్ రైటింగ్ స్టైల్ ను ఫాలో అయ్యేలా కొంతమందిని ట్రెయినింగ్ ఇస్తున్నట్లు టాక్. అదేవిధంగా అనిల్ రావిపూడి సలహా మేరకు, జబర్దస్త్ రైటర్స్ ను కూడా తన టీమ్ లో యాడ్ చేసుకున్నాడట. అలాగే రావిపూడి దగ్గర వర్క్ చేసిన సహాయక రచయితలతో టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ గా విజయం సాధించే కథలు రాసే రైటర్స్ ను తన క్యాంప్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇకపై దిల్ రాజు బ్యానర్ లో ఎలాంటి సినిమాలు వస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. కానీ తాను తీయబోయే సినిమాలన్నీ కమర్షియల్ జోనర్ లో ఉండేలా చూసుకోవాలని దిల్ రాజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ కొత్త ప్రణాళిక, భవిష్యత్తులో ఆయన బ్యానర్ ను మరింత పటిష్టంగా నిలబెడుతుందా? అనేది చూడాలి.