మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) దాదాపు 4 ఏళ్లుగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతూ వచ్చాడు. ఈ మధ్యనే చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరో 3 వారాల్లో మిగతా పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసి.. విడుదలకు ప్లాన్ చేయాలని శంకర్ (Shankar) భావిస్తున్నారు. మొత్తంగా దీనికి 3 నెలలు టైం పట్టొచ్చు. అయితే రిలీజ్ డేట్ వంటి వ్యవహారాలు అన్నీ దిల్ రాజుకి అప్పగిస్తారట శంకర్.
ఆ తర్వాత ఆయన ‘ఇండియన్ 3’ (Bharateeyudu -2) పెండింగ్ షూటింగ్ కోసం రంగంలోకి దిగుతారు. సరే ఇంతకీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు? చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. డిసెంబర్లో అదీ క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. అయితే డిసెంబర్ 6న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రన్ కనీసం 4 వారాలు ఉండొచ్చు. నార్త్ లో అయితే 5,6 వారాల వరకు రన్ ఉండొచ్చు. కాబట్టి.. మధ్యలో ‘గేమ్ ఛేంజర్’ వస్తే థియేటర్లు షేరింగ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది.
కాబట్టి ”గేమ్ ఛేంజర్’ రిలీజ్ సంక్రాంతికి అయితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఆ టైంకి నార్త్ లో కూడా సినిమాలు లేవు. కానీ తెలుగులో అదీ దిల్ రాజు (Dil Raju) బ్యానర్లోనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) – వెంకీ (Venkatesh) ..ల సినిమా ఆ డేట్ కి రిలీజ్ కావాలి. అలాగే ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా జనవరి 10 కి విడుదలవుతుంది అనే ప్రకటన వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.