తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలపై మళ్లీ కొత్త చర్చ మొదలైంది. ఈసారి బజ్ సెంటర్‌లో ఉన్నది ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju). ఆయన తాజాగా మలయాళ డైరెక్టర్ హనీఫ్ అదేనితో (Haneef Adeni) కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గా మార్కో సినిమాతో ఊచకోత అంటే ఎంటో చూపిన హనీఫ్, ఇప్పుడు మాస్ యాక్షన్ డ్రామాతో టాలీవుడ్‌ను టార్గెట్ చేయబోతున్నాడు. కథను ఇప్పటికే పూర్తి చేసిన ఈ దర్శకుడు, ప్రస్తుతం స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో రెండు ప్రధాన పాత్రలుంటాయని టాక్. ఇద్దరు హీరోలు కలిసి స్క్రీన్‌పై కనిపించాల్సిన ఈ కథకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. ఒకవేళ ఇద్దరూ తెలుగు హీరోలే అయితే.. సినిమా తెలుగు మార్కెట్‌కే ఫిక్స్ అవుతుందని టాక్. కానీ దిల్ రాజు వ్యూహం మాత్రం దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకెళ్లడమే. అందుకే బాలీవుడ్ లేదా తమిళం, మలయాళం నుంచి ఓ పెద్ద నటుడిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నిర్ణయంపై క్లారిటీ వచ్చాకే అధికారిక ప్రకటన చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
సినిమా కథలో మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ డ్రైవ్ కూడా బలంగా ఉండనుందని టాక్. థీమ్ యూనివర్సల్‌గా ఉండటంతో, సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మలచాలనే ఉద్దేశం ఉంది. కథలే కాకుండా సినిమాల ప్రెజెంటేషన్ కూడా మారుతున్న ఈ రోజుల్లో, తెలుగు నిర్మాతలు నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేయడం సహజం అయిపోయింది. అందుకే ఇది కేవలం రిజినల్ లెవెల్‌లో ఆగిపోకుండా, ఇతర భాషల్లోనూ చొరబడేలా ప్లాన్ చేస్తున్నారు.
దిల్ రాజుకు మల్టీస్టారర్ చిత్రాలపై ప్రత్యేక అనుభవం ఉంది. గతంలో ‘సీతమ్మ వాకిట్లో’ (Seethamma Vakitlo Sirimalle Chettu) , ‘ఎఫ్ 2’ (F2 Movie) వంటి చిత్రాలు సూపర్ హిట్స్ కావడమే కాక, ఆ కాంబినేషన్లు బిజినెస్ పరంగా కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు ఆయన ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తిగా మాస్ బేస్డ్, కమర్షియల్ హైప్లో నడిచే సినిమా. బడ్జెట్ పరంగా కూడా భారీగానే ఫిక్స్ చేశారని టాక్. మ్యూజిక్ డైరెక్టర్, టెక్నికల్ టీమ్ ఇప్పటికే చర్చల్లో ఉన్నారని సమాచారం.
ఇప్పుడు ఈ సినిమా మీద మొత్తం ఫోకస్ ఉన్నది ఇద్దరు హీరోల ఎంపికపైనే. ఒకసారి క్యాస్టింగ్ ఫిక్స్ అయితే, షూటింగ్ ముహూర్తం తేలిపోతుంది. ప్రస్తుతం హనీఫ్ కూడా ఫుల్ టైమ్‌గా ఈ ప్రాజెక్ట్‌కే అంకితమై పని చేస్తున్నాడు. తక్కువ టైంలో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్మాతల లక్ష్యంగా ఉంది. మరి దిల్ రాజు – హనీఫ్ కలయికతో తెరకెక్కబోయే ఈ మల్టీస్టారర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.