కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా ‘దిల్ రుబా’ (Dilruba) అనే సినిమా రూపొందింది. విశ్వ కరుణ్ (Vishwa Karun) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విక్రమ్ మెహరా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్,రవి, జోజో జోస్ (Jojo Jose) ,, రాకేష్ రెడ్డి (Rakesh Reddy) నిర్మాతలు. మార్చి 14న హోలీ పండుగ రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్స్ ఓకే అనిపించాయి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్మాతల్లో ఒకరైన రవి మాట్లాడుతూ కొంచెం ఓవర్ ది టాప్ అనే విధంగా కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ” ‘దిల్ రుబా’ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అందుకే ఈ సినిమాని ఎవ్వరికీ అమ్మకుండా మేము ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాం. ప్రతి నిర్మాత సినిమా రిలీజ్ రోజున సాయంత్రం పూట ప్రెస్ మీట్ పెడతారు. కానీ నేను మార్నింగ్ షో అయిన వెంటనే.. అంటే మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతాను. అప్పుడు అందరినీ అడుగుతాను. థియేటర్లో కిరణ్ అబ్బవరం చేసే ఫైట్స్ చూసి మీరు తెరలు చింపేయకపోతే..
ఆ ప్రెస్ మీట్ కి వచ్చి నన్ను చితక్కొట్టి బయటకు విసిరేయండి. తర్వాత నేను సినిమాలు కూడా నిర్మించడం మానేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాత రవి చేసిన ఈ కామెంట్స్ పై కొన్ని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న నాని (Nani) వంటి స్టార్ హీరో తాను నిర్మించిన ‘కోర్ట్’ (Court) సినిమా గురించి మాట్లాడుతూ.. ” మీరు ‘కోర్ట్’ సినిమా చూసి ఇది బాలేదు అని మీకు అనిపిస్తే.. రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యే నా ‘హిట్ 3’ (HIT 3) సినిమాకి రాకండి.
దానికి నేను ‘కోర్ట్’ కంటే 10 రెట్లు డబ్బులు ఎక్కువ పెట్టాను” అంటూ చెప్పాడు. అది అతని కాన్ఫిడెన్స్ అయ్యుండొచ్చు. ఎందుకంటే నాని తన కంటెంట్ విషయంలో ఇప్పటివరకు చెప్పింది ఎప్పుడూ తప్పు అవ్వలేదు. కానీ కొత్త నిర్మాత(దిల్ రుబా) ఇలాంటి ఓవర్ ది టాప్ కామెంట్స్ చేయడం.. ఒకవేళ అవి నిజం కాదు అని అనిపిస్తే.. మొదటికే మోసం వస్తుంది. మరి అతను ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశాడో.
‘దిల్ రుబా’ లో కిరణ్ అబ్బవరం ఫైట్స్ చూసి మీరు తెరలు చింపేయకపోతే.. మధ్యాహ్నం పెట్టే ప్రెస్మీట్లో నన్ను చితక్కొట్టేయండి: నిర్మాత
నన్ను చితక్కొట్టి బయటకి విసిరేయండి: నిర్మాత
కిరణ్ అబ్బవరం ఫైట్స్ చూసి మీరు మెస్మరైజ్ అవ్వకపోతే నేను సినిమాలు చేయను: నిర్మాత#Dilruba #KiranAbbavaram… pic.twitter.com/EQNGKlFmk7
— Filmy Focus (@FilmyFocus) March 11, 2025