చిరంజీవి (Chiranjeevi) ఫ్యాన్స్ చాలా రోజులుగా మథనపడడుతున్న విషయాన్ని ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాతో తీర్చేశారు దర్శకుడు కేఎస్ రవీంద్ర (Bobby) (బాబీ). ఆ సినిమాతో స్టార్ హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలో బాబీకి బాగా తెలుసు అనే మాటను మరోసారి నిరూపించారు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో నందమూరి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) పని చేసే అవకాశం సంపాదించారు. అదే ‘డాకు మహరాజ్’(Daaku Maharaaj). ఈ సినిమా విడుదల సందర్భంగా బాబీ వరుసగా మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తన తర్వాతి సినిమాల గురించి, గత సినిమా హీరో గురించి..
Bobby
అతనితో తీయబోయే కొత్త సినిమా గురించి కూడా మాట్లాడారు. చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వీటిపై ఆయన ‘అవును’ అని క్లారిటీ ఇచ్చేశారు. అలాగే రజనీకాంత్‌తో (Rajinikanth) కూడా ఓ సినిమా ఉంటుందని చెప్పారు. అయితే ఎప్పుడు, ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. రజనీకాంత్‌ని గతంలో కలిసినప్పుడు ఓ కథ చెప్పిన మాట నిజమే అని, ఆ ప్రాజెక్ట్ త్వరలోనే ఉంటుందని బాబీ తెలిపారు.
‘వాల్తేరు వీరయ్య’ సమయంలోనే చిరంజీవితోనూ మరో సినిమా అనుకున్నామని, అది కూడా తప్పక చేస్తామని చెప్పారు బాబీ. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు? ఏది వెనుక? అనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు. అంతేకాదు రవితేజ (Ravi Teja), వెంకటేష్ (Venkatesh Daggubati), నాగచైతన్యతో (Naga Chaitanya) మరో సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపారు. చిరంజీవితో తన అనుబంధం గురించి చెబుతూ..
తమ రిలేషన్ ప్రత్యేకమైనదని, తన సినిమాల గురించి ఎప్పుడూ ఆయన మాట్లాడుతుంటారని చెప్పారు బాబీ (Bobby). అంతే కాదు ‘డాకు మహారాజ్’ సినిమా టీజర్ చూసి చిరంజీవి ఫోన్ చేసి, అభినందించారని బాబీ చెప్పారు. ఇక ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఇది కనుక హిట్ అయితే స్టార్ హీరోలు అందులోనూ సినీయర్ స్టార్ హీరోలు బాబీకి డేట్స్ వరుస పెట్టి ఇవ్వడం పక్కా అని చెప్పొచ్చు.