Boyapati Srinu: బాలయ్య – చిరు సినిమా.. టైటిల్‌ ఏంటో చెప్పిన బోయపాటి!

బాలకృష్ణ (Nandamuri Balakrishna) – చిరంజీవి (Chiranjeevi) .. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తేనే ఓ హై వస్తుంది. ఎందుకంటే మాస్‌ హీరోలుగా ఇద్దరి ఫాలోయింగ్‌ అలాంటిది మరి. అలాంటిది ఇద్దరూ కలసి ఓ సినిమా నటిస్తాము అంటే ఇక ఆ ఆనందానికి అవధులే ఉండవు. ఇప్పుడు అలాంటి ఆనందంలోనే ఉన్నారు మెగా – నందమూరి ఫ్యాన్స్‌. దీనికి కారణం కొన్ని రోజుల క్రితం జరిగిన నందమూరి బాలకృష్ణ నట స్వర్ణోత్సవం. ఆ వేదిక మీదే చిరంజీవి ఈ మాట చెప్ఆపరు.

Boyapati Srinu

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లు అంటే ఏఎన్నార్‌ – ఎన్టీవోడు తరం.. ఆ తర్వాత కృష్ణ – కృష్ణం రాజు తరం అనేవారు. అయితే రీసెంట్‌ టైమ్స్‌ మన కుర్ర హీరోలు చేస్తున్నారు. అయితే సూపర్‌ 4 అని మనం ముద్దుగా పిలుచుకునే సీనియర్‌ స్టార్‌ హీరోలు మాత్రం కలసి నటించలేదు. దీంతో ఎప్పుడెప్పుడా ఆ ఫ్రేమ్‌ అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యతో ఓ సినిమా కలసి నటించాలి.. కథ సిద్ధం చేయండి అని చిరంజీవి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.

అంతేకాదు ఆ ఈవెంట్‌కి హాజరైన కుర్ర దర్శకుల పేర్లు పెట్టి మరీ పిలిచి కథ సిద్ధం చేయాలి అని అడిగారు కూడా. అందులో ఓ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) . మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచిన బోయపాటి.. బాలయ్యకు బాగా క్లోజ్‌. ఆయనతో మూడు బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు. ఇప్పుడు నాలుగో బ్లాక్‌బస్టర్‌ లోడింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఐదో సినిమా బాలయ్య – చిరుది అవ్వొచ్చనేలా ఆయన మట్లాడారు.

ఇటీవల బోయపాటి ఓ ఈవెంట్‌కి వచ్చినప్పుడు బ్లాక్‌బస్టర్‌ నందమూరి – మెగా కాంబో గురించి మాట్లాడారు. ఎదురుగా చిరు, బాలయ్యను పెట్టుకొని కథ రాయకపోతే వేస్ట్ అని అన్నారు. అంతేకాదు వారిద్దరే తన సినిమాకి టైటిల్ అని కూడా అన్నారు. దీంతో బ్లాక్‌బస్టర్‌ కాంబో గురించి మరింత హైప్‌ మొదలైంది. చూద్దాం బోయపాటి.. చిరు కోరికను ఎప్పటికి నెరవేరుస్తారో?

‘రియా ఎవరు?’.. ఇలా కూడా ట్రెండింగ్‌లోకి రావొచ్చా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus