యుంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరో. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 10 ఏళ్ళ వయసుకే ‘బాల రామాయణం’ అనే చిత్రంలో నటించాడు ఎన్టీఆర్. అందరూ చైల్డ్ ఆర్టిస్ట్ లతోనే ఈ మూవీని తెరకెక్కించాడు గుణశేఖర్. దీనికి గాను ఆయన నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నాడు.
అయితే ఈ చిత్రం షూట్ చేస్తున్నన్ని రోజులు ఆ పిల్లల అల్లరిని కంట్రోల్ చెయ్యడానికి.. ఇతని తల ప్రాణం తోకకి వచ్చేదట. అందులోనూ ఓ రోజు సెట్లో ఎన్టీఆర్ చేసిన పనికి.. బండబూతులు తిట్టాడట. విషయంలోకి వెళితే.. ‘బాల రామాయణం’ షూటింగ్లో భాగంగా ఓ రోజు రాముడు.. శివధనుస్సుని ఎత్తి విరిచే సన్నివేశం జరగాల్సి ఉందట. అయితే అప్పటికే పిల్లలలు సెట్లోకి వచ్చి తెగ అల్లరి చేసేసారట. ఈ దశలో ఎన్టీఆర్.. షూటింగ్ మొదలవ్వడానికి ముందే శివధనుస్సుని విరిచేసాడట.
అలా విరిచేసి దర్శకుడు గుణశేఖర్ సెట్లోకి వచ్చే టైంకి సైలెంట్ అయిపోయాడట. ఇక గుణశేఖర్ సెట్ కి వచ్చిన తరువాత ఈ విషయం తెలుసుకుని చాలా కోప్పడ్డాడట. వాళ్లందరినీ నిలదియ్యగా.. ఎన్టీఆర్ పేరు బయటకి వచ్చిందట. అప్పుడు షూటింగ్ కు కూడా అంతరాయం కలగడంతో గుణశేఖర్… ఎన్టీఆర్ ను తెగ తిట్టి పోసాడట. ఈ విషయాన్ని ఎన్టీఆరే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.