Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రిప్ట్..లో మార్పులు..నిజమేనా?
- September 14, 2024 / 07:45 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. 10 ఏళ్ళు సరైన హిట్టు లేకుండా గడిపిన పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది ఆ సినిమా. అప్పటికే ‘దబాంగ్’ సినిమా వచ్చి 2 ఏళ్ళు పూర్తయ్యింది. అలాగే తమిళంలో కూడా ఆ సినిమా రీమేక్ అయ్యింది. దీంతో ‘గబ్బర్ సింగ్’ ని ఎవరు పట్టించుకుంటారు? అని అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పై చాలా అనుమానాలు ఉండేవి.
Ustaad Bhagat Singh

కానీ ‘దబాంగ్’ కి ‘గబ్బర్ సింగ్’ కి చాలా తేడా ఉంటుంది. అలా అని పూర్తిగా వేరు అని చెప్పడానికి లేదు. కానీ తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు హరీష్ శంకర్ చాలా మార్పులు చేయడం వల్ల.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక అదే కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అనే సినిమా కూడా వస్తుంది. ఈసారి కూడా ‘గబ్బర్ సింగ్’ అనౌన్స్ చేసినప్పుడు ఎలాంటి అనుమానాలు ఉన్నాయో, అలాంటి అనుమానాలే ఉన్నాయి.

ఎందుకంటే హరీష్ శంకర్ చేసిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) పెద్ద డిజాస్టర్ అయ్యింది. అది కూడా రీమేక్ సినిమానే. అయినా ఎందుకో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేదు. రామ్ తో నెక్స్ట్ సినిమా చేయాలనుకున్నాడు హరీష్. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) తో రామ్ (Ram) కూడా దెబ్బ తినడంతో… ‘హరీష్ తో ఇప్పుడు వద్దులే’ అన్నట్లు వ్యవహరించాడట. దీంతో హరీష్.. మళ్ళీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పనిచేయాల్సి వస్తుంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. ‘ఉస్తాద్..’ స్క్రిప్ట్..లో కొన్ని మార్పులు చేస్తున్నారట.

అయితే అది ‘మిస్టర్ బచ్చన్’ ఫలితం ఎఫెక్ట్ అని కాదు. పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా, పలు కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. కాబట్టి సినిమాలను ఇప్పట్లో ఆయన సినిమాలకు ఎక్కువ టైం కేటాయించలేరు. విజయవాడకి దగ్గర ప్రాంతాల్లోనే ఆయన షూటింగ్ చేయాలి. అందుకోసమే ‘ఉస్తాద్..’ (Ustaad Bhagat Singh) స్క్రిప్ట్ ను బట్టి.. లొకేషన్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారట. అంతే..!












