Vaibhav: పవర్ స్టార్ చాలా స్ట్రిక్ట్ అంటున్న వైభవ్ రెడ్డి.!
- September 14, 2024 / 07:27 PM ISTByFilmy Focus
తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన కోదండరామిరెడ్డి (Kodandaramireddy) కుమారుడు వైభవ్ రెడ్డి (Vaibhav) దాదాపుగా అందరికీ సుపరిచితుడే. తెలుగులో హీరోగా ప్రయత్నించి కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఎందుకో ఇక్కడ మాత్రం హీరోగా సెటిల్ అవ్వలేకపోయాడు. కానీ.. తమిళంలో మాత్రం వరుస అవకాశాలతో తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నాడు. ఆ వైభవ్ రెడ్డి తెలుగులో చాన్నాళ్ల తర్వాత నటించిన వెబ్ సిరీస్ “బెంచ్ లైఫ్”. సోనీలైవ్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చిన వైభవ్ రెడ్డి, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో తన మెమరీస్ ను పంచుకున్నాడు.
Vaibhav

చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు కోదండరామిరెడ్డి చాలా సినిమాలు తెరకెక్కించారు. అలా ఒక సినిమా షూటింగ్ లో భాగంగా వైభవ్ కూడా ఒకసారి స్పాట్ కి వెళ్లాడట. అక్కడ వైభవ్ మరికొంత మంది పిల్లలతో కలిసి చేస్తున్న అల్లరిని కట్టడి చేయడం కోసం చిరంజీవి స్వయంగా పవన్ కళ్యాణ్ ను పిలిచి ఈ పిల్లల్ని చూసుకోమన్నారట. వెంటనే పవన్ కల్యాణ్ బెత్తం పట్టుకుని వైభవ్ రెడ్డి & గ్యాంగ్ ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడట.

కనీసం ఐస్ క్రీమ్ కూడా కొనుక్కోనివ్వలేదట. ఈ సందర్భాన్ని పేర్కొంటూ.. అప్పట్లోనే ఆయన కర్ర పట్టుకుని లీడర్ లా బిహేవ్ చేసేవాడు అని వైభవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. “బెంచ్ లైఫ్” అనే సిరీస్ తో వైభవ్ రెడ్డి తనకు తెలుగులో కూడా మంచి రోల్స్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరి తెలుగు కుర్రాడు వైభవ్ ను మన తెలుగు దర్శకులు పట్టించుకుంటారో లేదో చూడాలి!
Actor vaibhav shares his funny childhood memory with @PKCreativeWorks pic.twitter.com/QwsohHlDu3
— Bhagat (@Only_PSPK) September 13, 2024

















