పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహామ్యాక్స్ అనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి మాట్లాడుతూ పొరపాటున నోరు జారారు. తన సినిమా పేరును తప్పుగా పలకడంతో ఇదే అదునుగా భావించి పవన్ కళ్యాణ్ పై చాలామంది విభిన్న రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలోను రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయన తన పూర్తి దృష్టి మొత్తం ప్రస్తుతం రాజకీయాలపై పెట్టారు. దీంతో తన సినిమా పనులను తరచు వాయిదా వేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ తన సినిమా పేరును తప్పుగా పలకడంతో ట్రోలర్స్ కు మంచి స్టఫ్ దొరికిందని చెప్పాలి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ను దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ హరీష్ శంకర్ దర్శకత్వంలో తాను నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సినిమా పేరుకు బదులు సర్దార్ భగత్ సింగ్ అని పలికారు.

దీంతో ఈయన పట్ల భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ గురించి ట్రోల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా(Ustaad Bhagat Singh) డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. అయితే పవన్ చేసినటువంటి ఈ తప్పు వ్యాఖ్యలను ఈయన కవర్ చేసే ప్రయత్నం చేశారనే చెప్పాలి.
ఈ సందర్భంగా హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ గారు సినిమా పేరు తప్పుగా పలకడంతో బాగా వైరల్ అయింది.బహుశా ఆయన సినిమా పేరును కరెక్ట్ గా పలికిన మా సినిమాకు ఇంత పాపులారిటీ వచ్చేది కాదేమో ఆయన తప్పు పలికే మాకు మంచి జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ మాటలను కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన సినిమా పేరును మర్చిపోవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారనే చెప్పాలి.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!
