టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో మహి వి రాఘవ్ ఒకరు కాగా ఈ దర్శకునికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. యాత్ర, యాత్ర2 సినిమాలతో పాపులర్ అయిన ఈ దర్శకుడికి ఏపీ ప్రభుత్వం రెండెకరాల స్థలం ఇచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అయితే విమర్శలు పెరుగుతుండటంతో మహి వి రాఘవ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. రాయలసీమకు సినిమా ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని మహి వి రాఘవ్ అన్నారు.
రాయలసీమ కోసం నా వంతు ఏమైనా చేయాలనే ఆలోచనతో రెండెకరాల భూమిలో మినీ స్టూడియోను నిర్మించాలని అనుకున్నానని మహి వి రాఘవ్ కామెంట్లు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాయలసీమలో షూటింగ్ లు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరని మహి వి రాఘవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు.
వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఎక్కడెక్కడో భూములు ఇచ్చారని ఆ భూముల గురించి మాత్రం ఎవరూ కామెంట్ చేయరని మహి వి రాఘవ్ వెల్లడించడం గమనార్హం. నా ప్రాంతానికి ఏదో చేయాలని ఆశయం లేకపోతే నేను ఇతర ప్రాంతాల్లో స్థలం అడిగేవాడినని మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు. నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలని అనుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు.
సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయడానికి ఎవరూ ఇష్టపడరని (Mahi V Raghav) మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు. నేను రాయలసీమలో తీసిన మూడు ప్రాజెక్ట్స్ కోసం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశానని ఆయన కామెంట్లు చేశారు. నేను కేవలం రెండెకరాల్లో మాత్రమే స్టూడియోను నిర్మిస్తున్నానని మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు.