మణిరత్నం (Mani Ratnam) ఒకప్పుడు కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు. ఓ రకంగా మొట్ట మొదటి పాన్ ఇండియా దర్శకుడు అనుకోవచ్చు. ‘రోజా’ (Roja) ‘దళపతి’ ‘గీతాంజలి’ ‘సఖి’ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. తమిళంలోనే కాకుండా ఆయన సినిమాలు హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యాయి. మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని స్టార్లు కూడా కలలు కనేవారు.
Naveen Polishetty
మహేష్ బాబు వంటి స్టార్ హీరో సైతం మణిరత్నంతో ఓ సినిమా చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ‘నేను అదృష్టవంతుడిని’ అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ తర్వాత మణిరత్నంకి ప్లాపులు పడటంతో మహేష్ (Mahesh Babu) కూడా సైడ్ అయిపోయాడు. అయితే ‘నవాబ్’ (Nawab) ‘పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan) ‘(సిరీస్)..లతో మణిరత్నం ఫామ్లోకి వచ్చారు. ఆయన కమల్ హాసన్ తో చేసిన ‘థగ్ లైఫ్’ (Thug Life) కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దీని తర్వాత మణిరత్నం నెక్స్ట్ సినిమా ఎవరితో? అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరోతోనే మణిరత్నం సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మణిరత్నం తెలుగు హీరోని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తెలుగు హీరో మరెవరో కాదు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). కథ కూడా లాక్ అయిపోయినట్టు సమాచారం. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను (Rukmini Vasanth) ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తుంది.