ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ జీవితాన్ని మార్చేస్తుందని చాలామంది దర్శకుల విషయంలో ఇప్పటికే ప్రూవ్ కాగా హనుమాన్ (Hanu Man) సినిమాతో ప్రశాంత్ వర్మకు (Prasanth Varma) ఏ రేంజ్ హిట్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విడుదల కానున్న చాలా పెద్ద సినిమాలు సైతం హనుమాన్ సినిమా రేంజ్ లో కలెక్షన్లను సాధించడం తేలిక కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రశాంత్ వర్మ ఒక వీడియోను చూసి ఎమోషనల్ అయ్యారు.
ప్రశాంత్ వర్మ చదివిన స్కూల్ కు చెందిన విద్యార్థులు హనుమాన్ అనే పేరు వచ్చేలా విద్యార్థులు గ్రౌండ్ లో కూర్చున్నారు. హనుమాన్ మూవీ 330 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాల్యంలో ప్రశాంత్ వర్మ సరస్వతి శిశుమందిర్ విద్యాలయాలలో చదువుకున్నాడు. హనుమాన్ రిలీజ్ కు ముందురోజు పాలకొల్లు శ్రీ సరస్వతీ విద్యామందిర్ నుంచి ఈ వీడియో వచ్చిందని ఆయన తెలిపారు.
ఆ వీడియో చూసిన సమయంలో తాను ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. అప్పటి వీడియోను ఇప్పుడు షేర్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పాలకొల్లు సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు, టీచర్లు ప్రశాంత్ వర్మకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ వీడియోను పంపించారు. ఊహించని సర్ప్రైజ్ కావడంతో ప్రశాంత్ వర్మ ఎమోషనల్ అయ్యారు. అయితే ప్రశాంత్ వర్మ చాలా రోజుల క్రితమే ఈ వీడియోను పంచుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంత్ వర్మ క్రేజ్, రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉండగా జై హనుమాన్ 2026 సంవత్సరంలో విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ ఆలోచనలు మారిపోయాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వచ్చాయి.