Sekhar Kammula: విజయ్ దేవరకొండ గురించి శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. రూ.20 కోట్లు పారితోషికం అందుకుంటున్న అతి తక్కువ మంది టాలీవుడ్ హీరోల్లో ఒకడు అని కూడా చెప్పాలి. ఈ స్టార్ డం అనేది విజయ్ కి అంత ఈజీగా దొరికింది కాదు. నటనపై మక్కువతో థియేటర్ ఆర్టిస్ట్ గా చేశాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్ట్ చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ (Life Is Beautiful) సినిమాలో కూడా అతను నటించాడు.

Sekhar Kammula

ఆ సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించాడు అని చెప్పవచ్చు. విజయ్ తో పాటు అతని బ్యాచ్ నాగ్ అశ్విన్, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కూడా ఆ సినిమాలో నటించారు. ఇప్పుడు వాళ్లంతా స్టార్స్ గా ఎదిగారు. అది పక్కన పెడితే.. ఇటీవల దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు శేఖర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మాట్లాడుతూ.. “విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి. చేద్దాం..! ఇప్పుడు బాగున్నాడు కదా..! పైగా వాడు ఇప్పుడు స్టార్ అయిపోయాడు.దొరుకుతాడో లేదో చూడాలి. విజయ్ ఎదుగుదల పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. నా సినిమా చేయడం వల్ల అతను స్టార్ అయిపోయాడు అని నేను అనుకోను. నేనే అతనికి ‘గాడ్ ఫాదర్’ అని నాకు ఉండదు. కానీ అతని పట్టుదలని బట్టి ఎదిగాడు అని నేను సంతోషిస్తాను.

నేను అతన్ని లాంచ్ చేశాను అని నాకు ఉండదు. వాళ్ళ డ్రీం కోసం వచ్చి నా సినిమాలో వాళ్ళు నటించారు అని అనుకుంటాను. నా సినిమా ఆడిషన్స్ కి వచ్చే వాళ్ళు ‘ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి’ అనుకుంటారు… కానీ నాకు ‘నువ్వు సెలెక్ట్ అవ్వాలి’ అని మనసులో అనుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. శేఖర్ కమ్ముల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 ‘దేవర’ వచ్చినా ‘సరిపోదా..’ సందడి తగ్గదట.. ఎలా అంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus