డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చిరంజీవి ఒక సినిమా చేయాలి. దీన్ని త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో చేస్తున్నట్టు స్వయంగా చిరంజీవి (Chiranjeevi) ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) ప్రీ- రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. త్రివిక్రమ్.. చిరుకి వీరాభిమాని కావడంతో ఈ ప్రాజెక్టు ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత త్రివిక్రమ్ తప్పుకోవడం.. అతని శిష్యుడు అయినటువంటి వెంకీ కుడుములకు (Venky Kudumula) ఆ అవకాశం దక్కడం జరిగింది. ఈ ప్రాజెక్టును కూడా చిరు అనౌన్స్ చేశారు. కానీ ఇది కూడా మెటీరియలైజ్ కాలేదు.
అందుకు గల కారణాలు వెంకీ రివీల్ చేశాడు. వెంకీ కుడుముల (Venky Kudumula) మాట్లాడుతూ.. ” ‘భీష్మ’ (Bheeshma) తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ రాసుకున్నాను. ఒకరోజు ఆయనను కలిసి లైన్ చెప్పాను. ఆయన చాలా ఎక్సైట్ అవ్వడం జరిగింది. స్వయంగా ఆయనే నాతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించేలా చేసింది ఆ లైన్. నేను కూడా చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. అలాంటప్పుడు నేను ఆయనతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నప్పుడు..
నేను క్లౌడ్-9 లో ఉన్నాను. స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కి ఎక్కువ టైం తీసుకున్నాను. ఆయనతో సినిమా అని తెలిసినప్పటి నుండి నాలో ఉన్న దర్శకుడిని.. నాలో ఉన్న అభిమాని డామినేట్ చేయడం మొదలుపెట్టాడు. బోలెడన్ని ఎలివేషన్ సీన్స్ రాసేశాను. దీంతో చిరంజీవి గారు కొంచెం టైం తీసుకుందాం. ఇన్ని హై మూమెంట్స్ పెట్టేస్తే వర్కౌట్ అవ్వదు అని అన్నారు. అందుకే మా కాంబో డిలే అవుతుంది. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.