ఆస్కార్‌కి నామినేట్ అయిన వాళ్లకి డబ్బుతో పాటు అదిరిపోయే ఫెసిలిటీస్ ఏంటంటే..?

  • March 14, 2023 / 06:14 PM IST

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక ముగిసింది.. ఈసారి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీల్లో ఇండియాకి అవార్డ్స్ వచ్చాయి.. ఏళ్ల తరబడి నిరీక్షణ, అసలు కలలో కూడా ఊహించన అద్భుతం తెలుగు సినిమా విషయంలో జరిగింది.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలుచుకుని భారతదేశమంతా గర్వపడేలా.. ప్రపంచమంతా టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు తలతిప్పి చూసేలా చేసింది.. అయితే సినీ ప్రపంచంలో ప్రతిష్మాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న వారికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు? అనే దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు..

కట్ చేస్తే.. ఆస్కార్ విన్ అయిన వాళ్లకి ఎలాంటి ప్రైజ్ మనీ అనేది ఇవ్వరు.. ఆస్కార్ అవార్డ్ అనేదే అనంతమైన సంపదతో సమానం.. అందుకే వారికి ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరన్న మాట.. ఒకవేళ దాన్ని అమ్ముకుంటే ఒక్క డాలర్‌కి మించి రాదనే సంగతి తెలిసిందే.. అయితే నామినీస్‌కి మాత్రం రూ. 1 కోటి విలువైన గిఫ్ట్ బ్యాగ్స్ అందజేస్తారు.. డైరెక్టర్, యాక్టర్, యాక్ట్రెస్, సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్ వీరికి మాత్రమే ఈ లగ్జరీ బహుమతులు పొందే అవకాశం ఉంటుంది.

ఎవరైతే ఆస్కార్ నామినేషన్స్ లో ఉండి ఆస్కార్ అవార్డు పొందలేదో వారు రూ. 1.03 కోట్ల విలువైన లగ్జరీ బహుమతులను అందుకోనున్నారు. ప్రతి ఏటా ఆస్కార్ నామినేషన్స్‌లో ఉండి అవార్డు పొందని వాళ్ళని ఓదార్చడానికి లగ్జరీ బహుమతులను అందజేస్తుంటారు. అలానే విదేశాలకు ఉచిత ట్రిప్ లు వేసుకోండి అని అవకాశం ఇస్తారు. కాస్మెటిక్ ట్రీట్మెంట్లు ఏమైనా ఉంటే చేసుకోండి అని డబ్బులు కూడా ఇస్తారు. లగ్జరీ ఉత్పత్తులు సహా చాలా ఇస్తారు.

 

ఈ ఏడాది 95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. గార్డియన్ అనే యూఎస్ మీడియా కథనం ప్రకారం.. ఒక ప్లాట్‌తో సహా అనేక బహుమతులు అందజేస్తున్నారట. 8 మంది నామినీస్ మూడు రాత్రులు ఇటాలియన్ లైట్ హౌ‌స్‌లో గడిపే అవకాశం ఇస్తున్నారు. ఇది ఇటలీ తీరంలో ఒక ద్వీపంలో కొండ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ ప్లేస్. ఇక్కడ నామినీస్ గడిపేందుకు అయ్యే ఖర్చు 9 వేల యూఎస్ డాలర్లు. పూర్తిగా ఆస్కార్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. అలానే 40 వేల యూఎస్ డాలర్లు విలువైన లైఫ్ స్టైల్ వోచర్ ఇస్తున్నారు.

అంతేకాదు, ఆస్ట్రేలియాలోని మంచి ఏరియాలో ఒక ప్లాట్ కూడా ఇస్తున్నారు. కేట్ బ్లాంచెట్, మిచెల్లీ ఏఓహ్, ఆస్టిన్ బట్లర్, బ్రెండన్ గ్లీసన్ సహా పలువురు నామినీస్ అవార్డు తీసుకోకుండా నిరుత్సాహంగా వెనుదిరిగారు. మరి ఇలాంటి వారి ముఖాల్లో ఆనందం నింపడం కోసం 25 వేల యూఎస్ డాలర్ల విలువైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రుసుమును ఇంటి రెనోవేషన్ పనుల కోసం మైసన్ కన్స్ట్రక్షన్ వారి సౌజన్యంతో ఇస్తున్నారు. ఇక హీరోలు, హీరోయిన్లు, నటులు, నటీమణులు, సపోర్టింగ్ ఆర్టిస్టులు కాస్మొటిక్ ట్రీట్మెంట్లు చేయించుకునేందుకు ఒక్కో నామినీకి 41 వేల యూఎస్ డాలర్లు ఇస్తున్నారు.

ఈ మనీతో షోల్డర్, హెయిర్ లాస్, ఫేస్ వంటి వాటికి సర్జరీస్ చేయించుకోవచ్చు.. అలాగే గిఫ్ట్ బ్యాగ్‌లో ఇమ్యూనిటీ బూస్ట్, సి60 పర్పుల్ పవర్ ఎడిబుల్ మసాజ్ ఆయిల్, బ్లష్ సిల్క్స్ పిల్లో కేసులు, పాడవని కోకోనట్ వాటర్ ఉంటాయట.. జ్వరం వచ్చినప్పుడు రోగులకు పెట్టే బ్రెడ్ కూడా ఈ బ్యాగ్ లో ఉంటాయట. కాకపోతే అవి 18 యూఎస్ డాలర్ల విలువైన జపనీస్ మిల్క్ బ్రెడ్లు.. క్లిఫ్ థిన్స్ అనే చాక్లెట్లు, 13.56 డాలర్లు విలువ చేసే 100 క్యాలరీల స్నాక్ బార్ ఈ బ్యాగ్ లో పెట్టారట నిర్వాహకులు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus