సాధారణంగా సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ పాత్ర ఎంతో ఉండాలి. తెర వెనుక ఉండి సినిమాని ముందుకు నడిపించే వారే డైరెక్టర్లు. ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా ఆస్తులు కూడబెట్టిన డైరెక్టర్లను వేళ్లపై లేక పెట్టవచ్చు. అయితే తాజాగా జీక్యు నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల జాబితాను విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజమౌళి మాత్రమే చోటు దక్కించుకున్నారు.
మరి ఈ జాబితాలో అత్యంత ధనవంతుడైన దర్శకుడిగా మొదటి స్థానంలో ఎవరున్నారు. రాజమౌళి ఏ స్థానంలో ఉన్నారు అనే విషయానికి వస్తే..బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన రూ.1640 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి అత్యంత ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో రాజ్ కుమార్ హిరానీ 1105 కోట్ల రూపాయల ఆస్తిని కలిగి రెండో స్థానంలో ఉన్నారు.
ఇక మూడవ స్థానంలో 940 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి సంజయ్ లీలా భన్సాలీ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 720 కోట్ల రూపాయలతో అనురాగ్ కస్యప్, 300 కోట్ల రూపాయలతో కబీర్ ఖాన్ ఐదవ స్థానంలో ఉన్నారు. ఆరో స్థానంలో రోహిత్ శెట్టి 250 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నారు ఇక ఏడవ స్థానంలో టాలీవుడ్ డైరెక్టర్ జక్కన్న 158 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఏడవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత 76 కోట్ల రూపాయలతో డైరెక్టర్ జోయా అక్తర్ తర్వాత స్థానంలో నిలిచారు. ఇలా అత్యంత ధనవంతుల డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకోవడం విశేషం.