ఒక్కోసారి హీరోలకి కొంతమంది దర్శకులు కలిసొస్తారు. దర్శకులకి కంప్లీట్ గా సరెండర్ అయిపోయే బాలయ్య వంటి హీరోలు దొరికితే దర్శకులు ఎలాంటి అద్భుతాలు అయినా చేయొచ్చు అని ఆయనకు హిట్లు ఇచ్చిన దర్శకులు కొంతమంది చెబుతుంటారు. ఒకప్పుడు డైరెక్టర్ ఏం చెబితే అది గుడ్డిగా చేసే హీరోగా బాలకృష్ణ పేరు చెప్పేవారు. అలా అని అతనికి కథల పట్ల జడ్జిమెంట్ సరిగ్గా లేదు అని కాదు. దర్శకులకి ఆయన అలాంటి ఫ్రీడమ్ ఇచ్చేవారు. దానిని కొంతమంది మిస్ యూజ్ కూడా చేసుకున్నారు.
అందువల్ల కొన్నాళ్ళు =బాలయ్య ట్రోలింగ్ బారిన పడాల్సి వచ్చింది. బాలయ్య చాలా మంది కొత్త దర్శకులతో పనిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే కొంతమంది దర్శకులు బాలయ్యకి చాలా బాగా కలిసొచ్చారు. ఏకంగా హ్యాట్రిక్ సక్సెస్ లు అందించారు. బాలకృష్ణకి హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ. ఇతని దర్శకత్వంలో బాలయ్య ‘మంగమ్మ గారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’ వంటి చిత్రాలు చేసి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు.
ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘లారీ డ్రైవర్’ , ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి చిత్రాలతో వరుసగా 4 హిట్లు అందుకున్నారు బాలయ్య. కానీ బాలయ్య ఇమేజ్ ను ఓ రకంగా ఆపడగొట్టేసింది కూడా బి.గోపాల్ అనే చెప్పాలి. బాలయ్యతో ఆయన ‘పలనాటి బ్రహ్మనాయుడు’ అనే సినిమా తీసి పెద్ద ప్లాప్ ఇచ్చారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘సింహా’,’లెజెండ్’, ‘అఖండ’ వంటి సినిమాలతో ఈ కాంబోలో హ్యాట్రిక్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే.