Drushyam 2 Movie: ‘దృశ్యం2’ కి రూ.5 కోట్లు మైనస్.. కారణమిదే..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ ను తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని చోట్లా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందనే చెప్పాలి.దర్శకురాలు శ్రీప్రియ ఈ రీమేక్ ను తెరకెక్కించారు. అయితే మలయాళంలో దీనికి సీక్వెల్ ను కూడా రూపొందించడం..

అది నేరుగా ఓటిటిలో విడుదల చేయగా సూపర్ హిట్ అవ్వడం కూడా జరిగింది. దాంతో అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తోనే తెలుగులో కూడా ఆ చిత్రాన్ని రీమేక్ చేసారు.40 రోజుల్లో కేవలం రెండో రెండు షెడ్యూల్స్ లో ‘దృశ్యం2’ షూటింగ్ ను పూర్తి చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘దృశ్యం2’ ని థియేటర్లలో విడుదల చేయలేకపోయారు. ఆ టైములో ఈ చిత్రానికి రూ.45 కోట్ల భారీ ఆఫర్ వచ్చింది. కానీ నిర్మాత సురేష్ బాబు అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఇప్పుడు రూ.40 కోట్లకు ‘దృశ్యం2’ ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ వారికి అమ్మేసినట్టు తెలుస్తుంది.

నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. ఈ లోగా థియేటర్లు తెరుచుకుని పరిస్థితి సాధారణ స్థితికి వస్తే.. వారం రోజుల పాటు మొదట ‘దృశ్యం2’ ని థియేటర్లలో విడుదల చేస్తారట. మొదటి వారం పూర్తవ్వగానే ఓటిటిలో రిలీజ్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారమే రూ.5 కోట్లు తగ్గించి ‘దృశ్యం2’ ని ఓటిటికి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. వెంకటేష్ మరో మూవీ ‘నారప్ప’ కూడా ఓటిటిలోనే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus