నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది అప్పుడే ‘కోర్ట్’ తో (Court) ఓ పెద్ద హిట్ కొట్టాడు. ఆ సినిమా కోసం ఏకంగా తన ‘హిట్ 3’ (HIT 3) నే తాకట్టు పెట్టేశాడు నాని. దీంతో నిర్మాతగా తాను ఎంత ప్యాషన్ తో సినిమాని నిర్మిస్తాడు అనేది ఈ సినిమాతో అందరికీ మరింత క్లారిటీ వచ్చింది. ఒక దశలో ‘ఈ సినిమాకి మంచి రివ్యూలు వచ్చినా…
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావు, ఇది కేవలం ఓటీటీ సినిమా’ అని కూడా కొందరు క్రిటిక్స్ తమ రివ్యూల్లో పేర్కొన్నారు. కానీ వాళ్ళ అభిప్రాయం కూడా తప్పయింది. నాని ఎలాంటి ప్రయోగం చేసినా ఆదరించడానికి ‘మేము రెడీగా ఉన్నాం’ అని ‘కోర్ట్’ తో ఆడియన్స్ చెప్పినట్టు అయ్యింది. ఈ సినిమాతో దర్శకుడిగా రామ్ జగదీష్ కి చాలా మంచి పేరు వచ్చింది.
‘కోర్ట్’ తర్వాత రామ్ జగదీష్ బిజీ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే.. నాని నిర్మాణంలో పరిచయమైన దర్శకులు అందరూ ఈరోజు టాప్ ప్లేస్ లో ఉన్నారు. అందుకే రామ్ జగదీష్ కూడా పెద్ద బ్యానర్లో సినిమా చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ రెండో సినిమాని కూడా నాని బ్యానర్లోనే చేయబోతున్నాడట ఈ యంగ్ డైరెక్టర్.
అవును నానికి ‘కోర్ట్’ టైంలోనే మరో కథ చెప్పాడట రామ్ జగదీష్. అది కూడా కోర్ట్ రూమ్ డ్రామానే అని తెలుస్తుంది. కాకపోతే దానికి పెద్ద హీరో ఉంటే బాగుంటుంది అని నాని డిసైడ్ అయ్యాడట. ‘కోర్ట్’ హిట్ అయ్యాక.. దుల్కర్ సల్మాన్ కి (Dulquer Salmaan) ఆ కథ వినిపించాడట నాని. దుల్కర్ కి (Dulquer Salmaan) ఆ కథ బాగా నచ్చేసింది. దీంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.