వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కింది ఈ మూవీ. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాల్ చౌహాన్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించింది. మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవడం.. వెంకటేష్ మంచి ఫామ్లో ఉండడం ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని కలిగించాయి. దీంతో మే 27న విడుదల కాబోతున్న ‘ఎఫ్3’ మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలను ఒకసారి గమనిస్తే :
నైజాం
18.50 cr
సీడెడ్
8.20 cr
ఉత్తరాంధ్ర
7.30 cr
ఈస్ట్
4.50 cr
వెస్ట్
3.68 cr
గుంటూరు
4.45 cr
కృష్ణా
3.89 cr
నెల్లూరు
2.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
52.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.00 cr
ఓవర్సీస్
7.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
63.82 cr
‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘ఎఫ్2’ మూవీ ఫుల్ రన్లో రూ.80 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. పోటీగా పెద్ద సినిమా ఏమీ లేదు.మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కూడా చల్లబడిపోయింది.ఆ మూవీకి థియేటర్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి పాజిటివ్ టాక్ కనుక వస్తే ‘ఎఫ్3’ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.