క్రిష్ ను కలవర పెట్టిన శాతకర్ణి ఫేక్ న్యూస్ !
- October 27, 2016 / 01:21 PM ISTByFilmy Focus
ఒకొక్కసారి కొన్ని గాసిప్పులు ఎందుకు పుడతాయో వాటిని ఎవరు సృష్టిస్తారో అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ప్రచారంలోకి వచ్చిన గాలి వార్తలు సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి సందర్భమే దర్శకుడు క్రిష్ కు ఎదురైనట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ క్రిష్ కు ఫోన్ చేసి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టీజర్ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇప్పటి వరకు షూట్ చేసిన ఈ సినిమా రషస్ తాను చూస్తాను అని క్రిష్ కోరినట్లుగా వచ్చిన వార్తలు ఫిలింనగర్ లో పెను ప్రకంపనలే సృష్టించాయి.

















