టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ వల్లే హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యులలో కొందరు ఇండస్ట్రీలో దర్శకులుగా రాణిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో వేర్వేరు బ్యానర్లలో డైరెక్టర్ గా పని చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు. సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా త్రివిక్రమ్ ఒకే బ్యానర్ కు పరిమితం కావడం గమనార్హం.
త్రివిక్రమ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రివిక్రమ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాకు శ్రీనివాస్ గానే త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచమయ్యారని త్రివిక్రమ్ ఇంటికి వచ్చి గురువుగారు నాకు ఎక్కడైనా ఛాన్స్ ఇప్పించండి అని అడిగేవాడని కొమ్మనాపల్లి గణపతిరావు చెప్పుకొచ్చారు.
నేను మీకు అసిస్టెంట్ గా ఉంటానని త్రివిక్రమ్ తనతో అనేవాడని నేను జాబ్ చేస్తూ రైటర్ గా చేస్తున్నానని తాను రెగ్యులర్ రైటర్ కాదని చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. ఎంఎస్సీ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చానని త్రివిక్రమ్ చెబితే నీకేమైనా పోయేకాలమా అని తాను తిట్టానని కొమ్మనాపల్లి గణపతిరావు పేర్కొన్నారు. గోల్డ్ మెడలిస్ట్ కు సినిమా ఇండస్ట్రీ ఎందుకని ఇక్కడ రాజకీయాలను తట్టుకోలేవని అన్నానని ఆయన తెలిపారు.
త్రివిక్రమ్ రాసిన ది రోడ్ కథ చూసి షాకయ్యానని ఆయన తెలిపారు. పోసాని దగ్గర త్రివిక్రమ్ అసిస్టెంట్ గా చేరాడని ఇప్పటికీ ఇంటర్వ్యూలలో త్రివిక్రమ్ తన గురించి గొప్పగా చెబుతున్నారని త్రివిక్రమ్ సంస్కారం గొప్పదని ఆయన తెలిపారు. తాను సుద్దాల అశోక్ తేజను దాసరికి పరిచయం చేశానని సుద్దాల తర్వాత రోజుల్లో గొప్ప స్థాయికి చేరుకున్నాడని ఆయన వెల్లడించారు.