ఈ మధ్య కాలంలో విడుదలైన ఇండియన్2 (Bharateeyudu 2) , ది గోట్ (The Greatest of All Time) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోవడంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు ఫ్లాప్ కావడానికి ఈ సినిమాల రన్ టైమ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. 3 గంటల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాలు నిడివి వల్లే ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కంగువా (Kanguva) విషయంలో ఆ తప్పు జరగకూడదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కంగువా మూవీ ఏకంగా 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
Kanguva
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కంగువా (Kanguva) సినిమా మేకర్స్ సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది. నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ కాకపోతే మాత్రం డిసెంబర్ నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా రన్ టైమ్ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కంగువా సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సూర్య (Suriya) డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ సినిమాలకు 2 గంటల 45 నిమిషాలకు మించిన రన్ టైమ్ అనవసరం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిడివి విషయంలో తప్పులు చేస్తే మాత్రం భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. తెలుగులో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలకు సైతం ఇదే రూల్ ను ఫాలో అయితే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కంగువా సినిమా మొదట అనుకున్న తేదీ ప్రకారం అక్టోబర్ నెల 10వ తేదీన విడుదల కావాల్సి ఉండగా వేట్టయాన్ (Vettaiyan) సినిమా ఆ తేదీన విడుదలవుతూ ఉండటంతో ఈ సినిమా తప్పుకుంది. సోలో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని కంగువా (Kanguva) మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.