మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు వచ్చారు. ఎవరకి వారే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చకున్నారు. మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ముకుంద’, ‘కంచె’, ‘ఫిదా’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తర్వాత బాబాయ్ బ్లాక్ బస్టర్ ఫిలిం ‘తొలిప్రేమ’ టైటిల్‌తో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ చేశాడు. 2018 ఫిబ్రవరి 10న విడుదలైన ఈ మూవీ 2023 ఫిబ్రవరి 10 తో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..
వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తీసిన రొమాంటిక్ డ్రామా ‘తొలిప్రేమ’ తో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘స్నేహగీతం’ కి డైలాగులు రాసి, నటించిన వెంకీ.. తర్వాత ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ మూవీకి కూడా మాటలు రాశాడు. ‘కేరింత’ కి రచయితగా పనిచేసి.. ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. ఆకట్టుకునే కథ, కథనాలతో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించి ఫస్ట్ సినిమాకే బెస్ట్ అనిపించుకున్నాడు.
లండన్‌లో స్టోరీ స్టార్ట్ చేసి.. ఇండియాకు తీసుకు రావడం.. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, భావోద్వేగాలు వంటివి చక్కగా చూపిస్తూనే.. ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవడం.. ఒకరికొకరు కనిపించనంత దూరంగా వెళ్లిపోయినా కానీ ప్రేమే వారిని కలిపింది అన్నట్టు అనుకోకుండా మళ్లీ కలవడం వంటివి చాలా చక్కగా చూపించి అలరించాడు దర్శకుడు.. వరుణ్, రాశీల కెమిస్ట్రీ యూత్‌కి కనెక్ట్ అయింది.
విజువల్స్, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ వంటి టెక్నికల్ వర్క్ అంతా కూడా ప్లస్ అయింది. తను రాసుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించడంలో వెంకీ సక్సెస్ అయ్యాడు. హృదయాన్ని తాకే అందమైన మాటలు రాశాడు. హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలెట్. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఫిదా అయ్యారు.