శ్రీవిష్ణు హీరోగా లవ్లీ సింగ్ హీరోయిన్ గా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్’ మరియు ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ల పై ఎస్.కృష్ణ, హరీష్ పెద్ది,సాహు గరపాటి లు కలిసి నిర్మించారు.అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సహానిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే ను కూడా అందించడంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.అయితే మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ రావడం, పైగా పోటీగా ‘జాతి రత్నాలు’, ‘శ్రీకారం’ వంటి బడా సినిమాలు ఉండడంతో ఈ చిత్రాన్ని పట్టించుకున్నవారే లేరు.దాంతో మినిమం ఓపెనింగ్స్ ను కూడా రాబట్టుకోలేకపోయింది ఈ చిత్రం.
ఇక ఈ చిత్రం 4డేస్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
0.25 cr
సీడెడ్
0.07 cr
ఉత్తరాంధ్ర
0.11 cr
ఈస్ట్
0.06 cr
వెస్ట్
0.04 cr
గుంటూరు
0.26 cr
కృష్ణా
0.05 cr
నెల్లూరు
0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.04 cr
ఓవర్సీస్
0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.94 cr
‘గాలి సంపత్’ చిత్రానికి 6.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.94కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 6.06కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘శ్రీకారం’ ‘జాతి రత్నాలు’ వంటి క్రేజీ సినిమాలు ఉండడంతో ‘గాలి సంపత్’ సినిమాకి పెద్ద దెబ్బ పడినట్టు స్పష్టమవుతుంది. కనీసం టాక్ అయినా పాజిటివ్ గా వచ్చి ఉండి ఉంటే.. ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించి ఉండేదేమో..!