రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో చాలా సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోగా గేమ్ ఛేంజర్ మూవీ మాత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు. రామ్ చరణ్ సినిమా విడుదలై దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. గేమ్ ఛేంజర్ మూవీని 2024 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తారా? లేక మరో సమయంలో రిలీజ్ చేస్తారా? అనే ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది.
మొదట దిల్ రాజు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలని భావించారు. ఈ మొత్తంలో సగం బడ్జెట్ రెమ్యునరేషన్ల కోసమే ఖర్చైందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మారడం వల్ల బడ్జెట్ ఏకంగా 100 కోట్ల రూపాయలు పెరిగిందని ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అని సమాచారం. శంకర్ ఈ సినిమాలోని పాటల కోసమే 90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.
దర్శకుడు శంకర్ ఒకే సమయంలో (Game Changer) గేమ్ ఛేంజర్ సినిమాను ఇండియన్2 సినిమాను తెరకెక్కిస్తూ ఉండటం వల్లే గేమ్ ఛేంజర్ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా చరణ్ మార్కెట్ ను ఈ సినిమా డిసైడ్ చేయనుంది. గేమ్ ఛేంజర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు అయితే వస్తున్నాయి.
రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. కియారా అద్వానీ, అంజలి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా థమన్ ఈ సినిమాలోని ప్రతి సాంగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో దిల్ రాజు తప్పు చేశారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా శంకర్ ఏం మారలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.