Ginna Collections: టాక్ బానే ఉన్నా..బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది!

విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘అవా ఎంటర్‌టైన్‌మెంట్‌’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంయుక్తంగా నిర్మించాయి. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ వంటి మాస్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈషాన్ సూర్య ‘జిన్నా’ కి దర్శకత్వం వహించాడు. అయితే కథ, స్క్రీన్‌ప్లే మాత్రం కోన వెంకట్ అందించడం జరిగింది.పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్.. హీరోయిన్స్‌ . దీపావళి కానుకగా అక్టోబర్ 21న ‘జిన్నా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దారుణమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది.పండుగ సీజన్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ మూవీ ఫుల్ రన్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలింది.మంచు విష్ణు ప్లాప్ ట్రాక్ రికార్డ్ ను ఈ మూవీ కంటిన్యూ చేసింది అనే చెప్పాలి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.21 cr
సీడెడ్ 0.15 cr
ఆంధ్ర(టోటల్) 0.23 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్ + మిగిలిన వెర్షన్లు
0.14 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.73 cr

‘జిన్నా’ చిత్రానికి రూ.4.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.0.73 కోట్ల షేర్ ను రాబట్టింది.దీంతో బయ్యర్స్ కు రూ.3.87 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు స్పష్టమవుతుంది.

కాంపిటీషన్లో కాకుండా, సోలో రిలీజ్ అయ్యి ఉండుంటే.. ఈ మూవీ కాస్త మంచి ఫలితాన్ని అందుకునేదేమో..!ఇప్పుడైతే ‘కాంతార’ ‘సర్దార్’ ‘ఓరి దేవుడా’ ‘ప్రిన్స్’ వంటి చిత్రాల మధ్య నలిగిపోయి మినిమం ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది అనే చెప్పాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus