అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) మనవడు సుమంత్ (Sumanth) నటించిన హిట్ సినిమాల్లో ‘గోదావరి’ (Godavari) కూడా ఒకటి. కమలిని ముఖర్జీ (Kamalinee Mukherjee) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకుడు. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది.. అనేది ఈ సినిమా క్యాప్షన్. పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ‘తొలిప్రేమ’ (Tholi Prema) వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన జి.వి.జి రాజు (G. V. G. Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2006 మే 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ టైంకి చాలా పెద్ద సినిమాలు రన్ అవుతున్నాయి.
Godavari
‘పోకిరి’ (Pokiri) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఉన్నప్పటికీ ‘గోదావరి’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. భద్రాచలం బ్యాక్ డ్రాప్లో ఉండే లొకేషన్స్, గోదావరి అందాలు నడుమ సాగే ఈ సినిమా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. కె.ఎం.రాధాకృష్ణన్ (K. M. Radha Krishnan) సంగీతంలో రూపొందిన పాటలు కూడా చాలా వినసొంపుగా ఉంటాయి. ఈ సినిమాని ఇప్పటికీ టీవీల్లో, యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఇప్పుడు రీ- రిలీజ్..ల ట్రెండ్ నడుస్తోంది.
అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను లేదంటే కంటెంట్ బాగుండి పెద్దగా ఆడకపోయిన సినిమాలని ఇప్పుడు థియేటర్లలో చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. అప్పట్లో ఆడని సినిమాలు కూడా రీ- రిలీజ్లో బాగా ఆడిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలో ‘గోదావరి’ చిత్రాన్ని రీ- రిలీజ్ చేస్తే చూద్దామని ఆడియన్స్ భావిస్తున్నారు. మొత్తానికి వారి కోరిక తీరబోతుంది అనే చెప్పాలి.
అవును ‘గోదావరి’ సినిమా రీ- రిలీజ్ కాబోతోంది. మార్చి 1న ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. కాబట్టి.. రీ రిలీజ్లో ‘గోదావరి’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.