ఒకప్పటి స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్.. అంతకు మించి గొప్ప మనిషిగా పేరు ఉన్నటువంటి టి.కృష్ణ గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఎందుకో మొదటి ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ‘జయం’ సినిమాతో విలన్ గా మారి సక్సెస్ సాధించాడు. అటు తర్వాత చేసిన ‘నిజం’ ‘వర్షం’ సినిమాలు కూడా ఇతనికి ప్లస్ అయ్యాయి. అయితే ‘యజ్ఞం’ చిత్రంతో మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు గోపీచంద్. ఎంత మంది స్టార్ హీరోలు టాలీవుడ్లో ఉన్నా… యాక్షన్ హీరోగా గోపీచంద్ కు ఉన్న ఇమేజ్ వేరు.
గోపీచంద్ స్టార్ హీరో అవ్వాలి అనుకోని మిగతా స్టార్ హీరోల అభిమానులు కూడా ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొత్త హీరోల ఎంట్రీ వల్లనో ఏమో కానీ గోపీచంద్ ఒకప్పటిలా రాణించలేకపోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో చేసినా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన గోపీచంద్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. గోపీచంద్ హిట్టు మొహం చూసి చాలా రోజులైంది. మరి బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ స్టామినా ఎలా ఉంది.. అతని గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
1) లౌక్యం :
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.18 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.21.84 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ మూవీగా నిలిచింది.
2) జిల్ :
గోపీచంద్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.12.75 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
3) సౌఖ్యం :
గోపీచంద్ హీరోగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.6.8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
4) గౌతమ్ నంద :
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.10.7 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
5) ఆక్సిజన్ :
గోపీచంద్ హీరోగా ఏ.ఎం.జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5.7 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.
6) పంతం :
గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.13 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.10.24 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. యావరేజ్ గా నిలిచింది.
7) చాణక్య :
గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.4.3 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
8) సీటీమార్ :
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.13.23 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.11.32 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
9) ఆరడుగుల బుల్లెట్ :
గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో ఎప్పుడో 13 ఏళ్ళ క్రితం రూపొందిన ఈ మూవీ అనేక కారణాల వల్ల ఆలస్యంగా అంటే 2021 లో రిలీజ్ అయ్యింది. 3 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.1.63 కోట్ల షేర్ ను రాబట్టి.. ప్లాప్ గా మిగిలింది.
10) పక్కా కమర్షియల్ :
(Gopichand) గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.15 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.10.01 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి బిలో యావరేజ్ గా మిగిలింది.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘రామబాణం’ చిత్రం వీకెండ్ ముగిసేసరికి కేవలం రూ.2.67 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.15.5 కోట్ల షేర్ రాబట్టాలి.