గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఈ మధ్యనే ‘జాట్’ (Jaat) సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. సన్నీ డియోల్ (Sunny Deol) ఇందులో హీరో. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మించాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమాకి నార్త్ నుండి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. రొటీన్ కథ, కథనాలు అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ‘జాట్’ కి నార్త్ ఆడియన్స్ మంచి మార్కులు వేశారు. దీంతో అక్కడి బాక్సాఫీస్ వద్ద రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది ‘జాట్’.
కచ్చితంగా రూ.100 కోట్లు కొడుతుంది అనుకున్న టైంలో ఈ సినిమాకి పెద్ద దెబ్బ పడింది. ఎలా అంటే ఏప్రిల్ 18న ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) రిలీజ్ అయ్యింది. అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. మొదట ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు.అక్షయ్ కుమార్ కూడా ఫామ్లో లేకపోవడం అందుకు ఒక కారణం. కానీ మొదటి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. దీంతో రెండో రోజు నుండి ‘కేసరి 2’ కి కలెక్షన్స్ పెరిగాయి.
ఈ క్రమంలో ‘జాట్’ సినిమాకి కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాని అక్కడి జనాలు పట్టించుకోవడం లేదు. దీంతో గోపీచంద్ మలినేని ఆశలపై నీళ్లు జల్లినట్టు అయ్యింది. కచ్చితంగా ఈ సినిమా రూ.100 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే.. అక్కడ కూడా జెండా పాతేద్దాం అనుకున్నాడు.
వెంట వెంటనే అక్కడి స్టార్ హీరోలు తనతో సినిమాలు చేస్తారని ఆశపడ్డాడు. కానీ కుదర్లేదు. మరోపక్క నిర్మాతలు కూడా సేఫ్ అవ్వాలి అంటే రూ.100 నెట్ కలెక్షన్స్ రావాలి. అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ‘కేసరి 2’ కనుక రాకపోయి ఉంటే కచ్చితంగా ‘జాట్’ హవా ఇంకో వారం నడిచేది అనడంలో సందేహం లేదు.