Gopichand: ఆ స్టార్ అంటే గోపీచంద్ కు ఇంత అభిమానమా?

కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన హీరోలలో గోపీచంద్ ఒకరనే సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాలలో గోపీచంద్ విలన్ రోల్స్ లో నటించగా ఆ సినిమాలు గోపీచంద్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. వర్షం సినిమాలో గోపీచంద్ పోషించిన విలన్ రోల్ ఆ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత కాలంలో గోపీచంద్ హీరోగా మారి విజయాలు అందుకున్నారు. వచ్చే వారం మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

గోపీచంద్ కు జోడీగా రాశీఖన్నా ఈ సినిమాలో నటించగా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకునిగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న మారుతి ఈ సినిమాతో మరో సక్సెస్ ను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ ప్రభాస్ అడిగితే ఏ పాత్ర అయినా చేయడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. ప్రభాస్ అడిగితే కథ గురించి పాత్ర గురించి కూడా పట్టించుకోనని ప్రభాస్ కోరితే విలన్ రోల్ లో నటించడానికి సిద్ధమేనని గోపీచంద్ కామెంట్లు చేశారు.

నిజ జీవితంలో ప్రభాస్ గోపీచంద్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ గోపీచంద్ కాంబోలో మరో సినిమా వస్తుందో లేదో చూడాలి. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా వర్షం సినిమాతోనే స్టార్ హీరోగా గుర్తింపు దక్కింది. ప్రభాస్, త్రిష హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటించగా ఎం.ఎస్.రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

నిర్మాతగా ఎం.ఎస్.రాజుకు ఈ సినిమా మంచి లాభాలను అందించింది. వర్షం సినిమా తర్వాత ప్రభాస్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.